Reading Time: 2 minutes
మా బాలయ్య బంగారం..! హీరోయిన్ పాదాలకు నంస్కరించిన బాలకృష్ణ.. వీడియో వైరల్

నటసింహం నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు. బ్యాక్ టు బ్యాక్ విజయాలను అందుకుంటూ ఇండస్ట్రీలో రాణిస్తున్నారు బాలయ్య. ఈ మధ్యకాలంలో బాలకృష్ణ నటించిన సినిమాలన్నీ బాక్సాఫీస్ దగ్గర ఘనవిజయాలు అందుకుంటున్నాయి. వరుసగా 5 సినిమాల విజయంతో టాలీవుడ్ లో టాప్ హీరోగా కంటిన్యూ అవుతున్నారు నటసింహం.. చివరిగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో అఖండ 2 సినిమాతో ప్రేక్షకుల ముందుకువచ్చారు. ఈ సినిమా కూడా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ప్రస్తుతం గోపీచంద్ మలినేని దర్శకత్వంలో సినిమా చేస్తున్నారు బాలయ్య. తాజాగా బాలకృష్ణ ఢిల్లీలో జరిగిన ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ ఆఫ్ ఢిల్లీ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఆయనకు లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డును అందించారు. అయితే ఈ కార్యకరంలో జరిగిన ఓ ఆసక్తికర సంఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

బాలకృష్ణ ఓ హీరోయిన్ పాదాలకు నమస్కరించడం ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఆ హీరోయిన్ ఎవరో కాదు బాలీవుడ్ సీనియర్ నటి హేమమాలిని. ఇండస్ట్రీలో స్టార్ హీరోగా కొనసాగుతున్న బాలకృష్ణ ఇలా మరో హీరోయిన్ పాదాలకు నమస్కరించడం పై ఆయన అభిమానులు రకరకాలుగా స్పందిస్తున్నారు. బాలకృష్ణ సంస్కారం చూసి ఆయన అభిమానులు గర్వంగా ఫీల్ అవుతున్నారు. ఎంతైనా మా బాలయ్య బంగారం అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరికొంతమంది మొదటిసారి బాలకృష్ణ ఓ హీరోయిన్ పాదాలకు నమస్కరించడం చూస్తున్నాం అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

ఓ వైపు సినీ నటుడిగా.. మరో వైపు రాజకీయనాయకుడిగా రాణిస్తున్నారు. హీరోగా విభిన్నమైన పాత్రలు ఎంచుకుంటూ సినిమాలు చేస్తున్నారు బాలకృష్ణ. ప్రస్తుతం గోపీచంద్ మలినేని దర్శకత్వంలో సినిమానా చేస్తున్నారు. గతంలో ఈ ఇద్దరూ కలిసి వీరసింహారెడ్డి సినిమా చేశారు. ఈ సినిమా ఘనవిజయాన్ని సాధించింది. ఇక ఇప్పుడు మరోసారి ఈ ఇద్దరి కాంబోలో సినిమా వస్తుండటంతో అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. ఈ సినిమా చారిత్రక నేపథ్యంలో తెరకెక్కిస్తున్నారు గోపీచంద్. నయనతార ఈ సినిమాలో హీరోయన్ గా నటిస్తుంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.