Goa Travel Guide: మీ వేసవి సెలవులను ప్రత్యేకంగా, ఆనందంగా గడపాలని అనుకుంటున్నారా? అయితే, మీ ప్రయాణ ప్లాన్‌లో గోవాని తప్పక చేర్చండి. ఎక్కువ మంది వేసవి అంటే గోవాలో చాలా వేడి ఉంటుందని అనుకుంటారు. కానీ, నిజం ఏమిటంటే, ఈ సమయంలో గోవా తక్కువ రద్దీతో, తక్కువ ఖర్చుతో, బీచ్‌లను ఆనందించడానికి అత్యుత్తమ సమయం.
వేసవి గోవాలో:
తక్కువ ఖర్చు, ఎక్కువ సౌకర్యం: రిసార్ట్లు నవంబర్-డిసెంబర్ కంటే సగం ధరలో లభిస్తాయి. ఉదాహరణకు, సాధారణ రిసార్ట్లు రూ. 5,000 నుంచి ప్రారంభమైతే.. వేసవిలో అవి రూ. 2,000 కంటే తక్కువకే పొందవచ్చు. హాస్టళ్లు, హోమ్‌స్టేలు ఇంకా తక్కువ ఖర్చులో అందుబాటులో ఉంటాయి.
సౌకర్యవంతమైన రవాణా: స్కూటర్ల రెంటల్ ఖర్చు వేసవిలో రూ. 300 మాత్రమే; సాధారణంగా ఇది రూ. 500-800 వరకు ఉంటుంది. రైలు, విమాన టిక్కెట్ల ధరలు కూడా తగ్గుతాయి.
విలాసవంతమైన ఆవాసాలు: సముద్రం సమీపంలోని ఫైవ్-స్టార్ రిసార్ట్లు వేసవిలో భారీ తగ్గింపులు అందిస్తాయి.
రద్దీ లేని బీచ్‌లు..
ప్రసిద్ధ బాగా, అంజునా, కలంగుట్ బీచ్‌లు సీజన్లో కష్టంగా దొరుకుతాయి. కానీ, వేసవిలో, ఇవి సాధారణంగా ఖాళీగా ఉంటాయి. మీరు ప్రశాంతంగా కూర్చుని, అందమైన ఫోటోలు తీసుకోవచ్చు.
వాటర్ స్పోర్ట్స్, సాంస్కృతిక అనుభవం..
వేసవిలో స్కూబా డైవింగ్, పారాసైలింగ్, కయాకింగ్ వంటి ఆటలపై ఆస్వాదించవచ్చు. సాయంత్రం వేడి తగ్గినప్పుడు, పాత గోవా చర్చిలు, కోటలను, ఆలయాలను సందర్శించండి.
తక్కువ ఖర్చులో గోవా మొత్తం అనుభవించాలనుకుంటే, వేసవి ఎప్పుడూ అత్యుత్తమ సమయం. రద్దీ తక్కువ, ధరలు సౌకర్యవంతమైన ఈ కాలంలో మీరు గోవా నిజమైన అందాన్ని ఆస్వాదించవచ్చు.




