Reading Time: < 1 minute
Egypt Turkey And Saudi Ministers In Islamabad For Us Iran Mediation

Iran war: ఇరాన్ యుద్ధం ఆపడానికి తెర వెనక దౌత్య చర్చలు ప్రారంభమయ్యాయి. పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్ వేదికగా యూఎస్-ఇరాన్ మధ్య సయోధ్య కుదిర్చేందుకు ఈజిప్ట్, టర్కీ విదేశాంగ మంత్రులు పాకిస్తాన్ చేరారు. సౌదీ అరేబియా ఫారిన్ మినిస్టర్ కూడా ఈ చర్చల్లో పాల్గొననున్నట్లు తెలుస్తోంది. పాకిస్తాన్ మొత్తం చర్చల్లో కీలక పాత్ర పోషిస్తోంది.

Read Also: Dhurandhar: మా ప్రాంతం పేరు వాడుకున్నారు, డబ్బులు కట్టండి.. ‘‘ధురంధర్’’ మేకర్స్‌కు పాక్ ప్రజల వింత డిమాండ్..

పాకిస్తాన్ విదేశాంగ మంత్రి ఇషాక్ దార్, ఈజిప్ట్ బదర్ అబ్దెలాటీతో సమావేశమయ్యారు. సంయమనం, ఉద్రిక్తతల్ని తగ్గించడం, చర్చలు, దౌత్యం ద్వారా వివాదాన్ని పరిష్కరించాల్సిన అవసరాన్ని ఇరువరు నొక్కి చెప్పారు. పాక్ మంత్రి టర్కీ విదేశాంగ మంత్రి హకాన్ ఫిడాన్‌తో కూడా భేటీ అయ్యారు. ఇరాన్ పరిణామాల గురించి ఇరువురు చర్చించారు.

ఇదిలా ఉంటే, పాకిస్తాన్ మధ్యవర్తిత్వం చేయడంపై భారత్‌లోని విపక్షాలు ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ, బీజేపీ ప్రభుత్వంపై విరుచుకుపడుతోంది. ఇరాన్ యుద్ధం ఆపడంలో భారత్ విఫలమైందని, మోడీ సర్కార్ విదేశాంగ విధానంలో విఫలమైందని కాంగ్రెస్ నేత జైరాం రమేష్ ఆరోపించారు. ఈ విషయంపై భారత విదేశాంగ మంత్రి మాట్లాడుతూ.. భారత్ పాకిస్తాన్‌ లాగా ‘‘బ్రోకర్ దేశం’’ కాదని స్పష్టం చేశారు.