Reading Time: < 1 minute

పల్లెల అభివృద్ధే లక్ష్యం: ఎంపీ డీకే అరుణ

Caption of Image.

మరికల్​, వెలుగు :  గ్రామాల్లో మౌలిక వసతులు కల్పించి వాటిని అభివృద్ధి చేయడమే తమ ప్రధాన లక్ష్యమని మహబూబ్‌‌‌‌‌‌‌‌నగర్ ఎంపీ డీకే అరుణ తెలిపారు. శనివారం నారాయణపేట జిల్లా మరికల్ మండలం వెంకటాపూర్‌‌‌‌‌‌‌‌లో కేంద్ర ప్రభుత్వ నిధులు రూ. 20 లక్షలతో నిర్మించిన నూతన గ్రామ పంచాయతీ భవనాన్ని ఆమె పూజలు చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ నిధులను వినియోగించుకోవడానికి ఏప్రిల్ 10 వరకు అవకాశం ఉందని, దీనిని అన్ని గ్రామాల సర్పంచులు గమనించి సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అనంతరం సూర్యచంద్ర ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వాటర్ ప్యూరిఫైడ్ ప్లాంట్‌‌‌‌‌‌‌‌ను ఆమె ప్రారంభించారు. 

ఛత్రపతి శివాజీ విగ్రహావిష్కరణ

ధన్వాడ :  ధన్వాడలో ఛత్రపతి శివాజీ విగ్రహాన్ని ఎంపీ డీకే అరుణ ఆవిష్కరించారు. అంబేద్కర్ విగ్రహం నుంచి భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ శివాజీ తన తల్లి స్ఫూర్తితో దేశాన్ని, మహిళలను రక్షించడానికి ఎంతో త్యాగం చేశారని, యువత ఆయనను మార్గదర్శిగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. కామారెడ్డి ఎమ్మెల్యే కాట్రేపల్లి వెంకటరమణారెడ్డి మాట్లాడుతూ సనాతన ధర్మ పరిరక్షణకు, దేశ రక్షణకు యువత నడుం బిగించాలన్నారు. 
 

©️ VIL Media Pvt Ltd.