Reading Time: < 1 minute

అమరావతి: జెట్టి సినిమా హీరో తనను మోసం చేశాడంటూ ఓ యువకుడు ఆత్మ‌హ‌త్యాయ‌త్నం చేసుకున్న సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చిత్తూరు జిల్లాలో జరిగింది. చిత్తూరు జిల్లా బంగారుపాళ్యంలో లోకేష్ అనే యువకుడు నివసిస్తున్నాడు. లోకేష్ కు జెట్టి సినిమా హీరో మురళీ కృష్ణ పరిచయం ఉంది. మురళీ కృష్ణ డబ్బులు కావాలని పలుమార్లు అడగడంతో బంధువుల, ఇల్లు తాకుట్టు పెట్టి రూ.3.15 కోట్లు ఆయనకు ఇప్పించానని లోకేష్ ఆరోపణలు చేస్తున్నాడు. మురళీ కృష్ణ డబ్బులు తిరిగి ఇవ్వకపోవడంతో లోకేష్ ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. రైల్వే కాంట్రాక్ట్ పేరుతో మోసం చేశాడంటూ సూసైడ్ నోట్ రాసి ఆత్మహత్యాయత్నం చేసుకున్నాడు. వెంటనే అతడిని బంగారుపాళ్యం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. సూసైడ్ నోట్ లో తనకు జరిగిన అన్యాయంపై బాధితుడు లోకేష్ లేఖ రాశాడు.  కనీసం ఆస్పత్రి ఖర్చులకు రూ.20 లక్షలు ఇవ్వాలని కోరిన హీరో మురళీ కృష్ణ పట్టించుకోలేదన్నారు. తన ఇల్లు తాకట్టు పెట్టీ, బంధువుల దగ్గర అప్పులు చేసి  హీరోకు రూ.3.15 కోట్లు ఇచ్చానని, ఇప్పుడు తిరిగి ఇవ్వకపోవడంతో తాను మోస పోయానని పేర్కొన్నాడు. తనకు న్యాయం చేయాలని, తన కుటుంబాన్ని ఆదుకోవాలని కోరారు.