Reading Time: < 1 minute

గేదెల మేపేందుకు వెళ్లి ఈత కోసం నీటి గుంటలో దిగి ఇద్దరు బాలురు మృతి చెందిన సంఘటన సత్తుపల్లి పట్టణ శివారులో ఆదివారం మధ్యాహ్నం చోటుచేసుకుంది. బంధువులు తెలిపిన వివరాల ప్రకారం… సత్తుపల్లి మున్సిపాలిటీ పరిధిలోని ఎన్టీఆర్ నగర్ కు చెందిన ఒంటిపూడి దేవా (12) సంవత్సరాలు స్థానిక ఎన్టీఆర్ నగర్ ప్రభుత్వ పాఠశాలలో ఏడో తరగతి చదువుతుండగా వేంసూరు మండలం కుంచపర్తి గ్రామానికి చెందిన వంగూరి నాగబాబు (12) తన అమ్మమ్మ ఎన్టీఆర్ నగర్లో ఉండగా వారి ఇంటి దగ్గర ఉంటూ ఆదివారం కావడంతో సత్తుపల్లి మున్సిపాలిటీ సమీపంలోని గేదలు మేపేందుకు వెళ్లి సరదాగా నీటి గుంటలో దిగి ఇద్దరి విద్యార్థులు అక్కడికక్కడే మృతి చెందాడు.

హుటాహుటినా రంగంలోకి దిగిన అగ్నిమాపక, పోలీస్ సిబ్బంది, గజ ఈతగాళ్లను రంగంలోకి దించి నీటి గుంటలో పడి మృతి చెందిన విద్యార్థుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. 4 గంటలకు పైగా గాలింపు చేపట్టాగ ఇద్దరు మృతదేహాలను వెలికితీశారు. మృతదేహాలను శవ పంచనామా పరీక్ష కోసం సత్తుపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా ఓకే కాలనీకి చెందిన ఇద్దరు బాలురు మృతి చెందటంతో ఎన్టీఆర్ నగర్లో విషాదఛాయలు అలుపుకున్నాయి.