
IPL 2026: ఐపీఎల్ 2026 సీజన్ రెండో మ్యాచ్ వాంఖడే స్టేడియంలో ముంబై ఇండియన్స్ వర్సెస్ కోల్‌కతా నైట్ రైడర్స్ పోటీ పడుతున్నాయి. ఈ మ్యాచులో టాస్ గెలిచిన ముంబై జట్టు కెప్టెన్ హార్దిన్ పాండ్యా బౌలింగ్ తీసుకున్నాడు. దీంతో తొలుత బ్యాటింగ్ కి వచ్చిన కేకేఆర్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 220 పరుగులు చేసింది. అద్భుతమైన స్టార్ట్ చేసిన కోల్‌కతా ఓపెనర్లు.. హార్దిక్ పాండ్య వేసిన నాలుగో ఓవర్లో తొలి రెండు బంతులకు రహానే భారీ సిక్సర్లు బాదగా.. చివరి మూడు బంతులను ఫిన్ అలెన్ బౌండరీకి పంపడంతో ఏకంగా 26 పరుగులు రాబట్టారు.
6వ ఓవర్ వేసిన శార్దూల్ ఠాకూర్ అజింక్యా రహానే, ఫిన్ అలెన్ జంటను విడదీశాడు. ఆరో ఓవర్ రెండో బంతికి అలెన్ భారీ షాట్ ఆడబోయి బౌండరీ లైన్ వద్ద తిలక్ వర్మకి క్యాచ్ ఇచ్చి ఔట్ అయ్యాడు. అనంతరం కేకేఆర్ రూ. 25.20 కోట్లకు కొనుగోలు చేసిన కామెరాన్ గ్రీన్ కూడా పెద్దగా ఆకట్టుకోలేదు, కేవలం 18 పరుగులు చేసి స్టేడియం నుంచి నిష్క్రమించాడు. శార్దూల్ వేసిన 8.5వ బంతికి రుథర్‌ఫోర్డ్‌కు క్యాచ్ ఇచ్చిన గ్రీన్ డగౌట్ కి వెళ్లిపోయాడు. ఇక 27 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న కేకేఆర్ కెప్టెన్ అజింక్య రహానే.. 145 పరుగులు వద్ద శార్దూల్ ఠాకూర్ వేసిన 13.3వ బంతికి హార్దిక్ పాండ్యాకు క్యాచ్ పెవిలియన్ కి చేరుకున్నాడు.
అనంతరం బ్యాటింగ్ కేకేఆర్ వికెట్ కీపర్ అంగక్రిష్ రఘువంశీ చివర్లో మెరుపు బ్యాటింగ్ చేశాడు. ఘజన్‌ఫర్ వేసిన 15వ ఓవర్లో తొలి బంతికి రింకు ఫస్ట్ బాల్ కే ఫోర్ కొట్టగా, చివరి రెండు బాల్స్ ని రఘువంశీ ఓ ఫోర్, సిక్సు బాదడంతో 17 పరుగులు రాగా.. బోల్ట్ వేసిన 16వ ఓవర్లో 10 రన్స్, శార్దూల్ వేసిన 17 ఓవర్లో 14 పరుగులు వచ్చాయి. ఇక 18వ ఓవర్లో బుమ్రా బౌలింగ్ లో పరుగులు చేసేందుకు కేకేఆర్ బ్యాటర్లు ఇబ్బంది పడ్డారు ఈ ఓవర్లో కేవలం 8 పరుగులు వచ్చాయి. ఇక 4వ వికెట్ కి రింకు– రఘువంశీ 60 పరుగులు భాగస్వామ్యాన్ని హార్దిక్ పాండ్యా బ్రేక్ చేశాడు. రఘువంశీ (29 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్సులతో 51 పరుగులు) అర్థ శతకం కొట్టిన తర్వాత బంతికే అవుట్ అయ్యాడు.
రఘువంశీ ఔట్ అయిన తర్వాత రింకు సింగ్ చెలరేగి బ్యాటింగ్ చేశాడు. 21 బంతుల్లోనే 4 ఫోర్లు కొట్టి 33 పరుగులు చేయడంతో కేకేఆర్ నిర్ణీత 20 ఓవర్లలో 220 పరుగులు చేసింది. మరోవైపు ముంబై ఇండియన్స్ బౌలర్లలో శార్దూల్ ఠాకూర్ కీలకమైన వికెట్లు తీసుకుని కేకేఆర్ ని దెబ్బకొట్టగా, హార్దిక్ పాండ్యా 39 పరుగులు ఇచ్చి ఒక వికెట్ తీసుకున్నాడు. మిగతా బౌలర్లలో ఏ.ఎం. ఘజన్‌ఫర్ 4 ఓవర్లలో ఏకంగా 51 పరుగులు సమర్పించుకున్నాడు. బుమ్రా, బోల్ట్, సైతం రన్స్ భారీగా ఇచ్చారు.
Shardul Thakur with a big impact on his @mipaltan debut 👊
Glimpses of his brilliance 🔥
Updates ▶️ https://t.co/JmJcgsoHQ7#TATAIPL | #KhelBindaas | #MIvKKR pic.twitter.com/VET0mjgNCh
— IndianPremierLeague (@IPL) March 29, 2026