సరైన టైంలో మరిగించడం: చాలా మంది మార్కెట్ నుంచి పాలు తెచ్చిన తర్వాత కాసేపు అలానే ఉంచి తర్వాత కాగబెడతారు.కానీ వేసవిలో ఇలా చేయడం తప్పు.. మీరు షాప్ నుంచి తెచ్చిన వెంటనే పాలను కాగబెట్టండి. ఎందుకంటే మీరే షాప్ నుంచి తెచ్చే మార్గంలోనే ఉష్ణోగ్రతల వల్ల దానిలో ఉండే బ్యాక్టీరియా వృద్ధి చెందవచ్చు. కాబట్టి వేసవిలో, పాలను రోజుకు రెండుసార్లు, ఉదయం ఒకసారి, సాయంత్రం ఒకసారి మరిగించడం ఉత్తమం.
శుభ్రమైన పాత్రలలో మరిగించడం: కొన్ని సార్లు మరిగించే పాత్ర సరిగ్గా లేకపోయానా పాలు విరిగిపోతాయి. కాబట్టి పాలను మరిగించే ముందు పాత్ర శుభ్రంగా కడగండి. అలానే మరిగించిన పాలను నిల్వ చేయడానికి శుభ్రమైన, పొడి పాత్రలను ఉపయోగించండి. పాత్రలలో మిగిలి ఉన్న కొద్దిపాటి పాలు లేదా తేమ అయినా బ్యాక్టీరియా వృద్ధిని పెంచుతుంది. అలాగే పాలను మరిగించేందుకు ఎప్పుడూ స్టెయిన్లెస్ స్టీల్ పాత్రలనే వాడడండి. ఎందుకంటే వాటిని శుభ్రపరచడం, నిర్వహించడం సులభం. అంతేకాకుండా, పాలు చల్లారిన వెంటనే వాటిని తప్పకుండా ఫ్రిజ్‌లో పెట్టండి .
ఫ్రిజ్‌లో నిల్వ చేయండి: పాలు గది ఉష్ణోగ్రతకు చల్లారిన తర్వాత వాటిని ఫ్రిజ్‌లో పెట్టడం చాలా ముఖ్యం. పాలను ఎక్కువసేపు గది ఉష్ణోగ్రతల వద్ద ఉంచడం వల్ల అవి చాలా త్వరగా విరిగిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి వేసవిలో, పాలను ప్రిజ్ డోర్ దగ్గర పెట్టడం కన్నా.. డీ ప్రిజ్‌లో ఉంచడం చాలా ఉత్తమం. ఎందుకంటే తరచూ మనం డోర్ తీస్తూ ఉంటాం. దీని వల్ల ఉష్ణోగ్రత హెచ్చుతగ్గులకు లోనవుతుంది. ఈ కారణంగా పాలు విరిగిపోయే ప్రమాదం ఉంటుంది.
బేకింగ్ సోడాను ఉపయోగించండి: పాలు విరిగిపోకుండా ఉండాలంటే మీకు బేకింగ్ సొడా చాలా బాగా ఉపయోగపడుతుంది. పాలలో చిటికెడు బేకింగ్ సోడా కలపడం వల్ల ఆమ్లత్వాన్ని తటస్థీకరించి, పాల నిల్వ కాలాన్ని కొద్దిగా పొడిగించవచ్చు. బేకింగ్ సోడాను ఉపయోగించేటప్పుడు జాగ్రత్తగా ఉండండి, ఎందుకంటే ఎక్కువగా కలిపితే పాల అసలు రుచి మారిపోతుంది.
Milck Storage Tips (1)




