
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో మేనకాగాంధీ బృందం భేటీ అయింది. రాష్ట్రంలోని మున్సిపాలిటీలలో వీధికుక్కల నిర్వహణ, గోసంరక్షణ చర్యలపై అధికారులు వివరించారు. వీధికుక్కలకు స్టెరిలైజేషన్ పై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు.
ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రంలో గోసంరక్షణకు ప్రభుత్వం ఇప్పటికే ప్రణాళికలు సిద్దం చేసిందన్నారు. అత్యాధునిక సౌకర్యాలతో విశాల ప్రదేశంలో ఎన్కపల్లిలో గోశాల నిర్మాణం చేస్తున్నామన్నారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలు , ఆలయాల సమీప ప్రాంతాల్లో గోశాలల నిర్మాణానికి ప్రణాళికలు సిద్దం చేస్తున్నట్లు సీఎం చెప్పారు.
►ALSO READ | మొయినాబాద్ ఫామ్ హౌస్ డ్రగ్స్ కేసు.. వాచ్ మెన్ భార్య పెద్ద కథే నడిపింది !
జంతు సంరక్షణ విషయంలో తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న వివిధ కార్యక్రమాలపై మేనకా గాంధీ సంతృప్తి వ్యక్తం చేశారు. ప్రభుత్వ యంత్రాంగం చూపిస్తున్న చొరవను అభినందించారు. రాష్ట్ర ప్రభుత్వ కృషిని ప్రశంసించడంతో పాటు జంతువుల సంక్షేమం పట్ల చూపుతున్న నిబద్ధతను ఈ సందర్భంగా కొనియాడారు.