
హైదరాబాద్: ఖనిజ సంపద ఆదాయాన్ని పెంచాలనే ఆలోచనతో ప్రభుత్వం పనిచేస్తోందని సిఎం రేవంత్ రెడ్డి తెలిపారు. తెలంగాణ వచ్చాక దళితులకు పాలన చేతకాదని వారిని పక్కన పెట్టారు అని అన్నారు. తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో మైనింగ్ శాఖ అవినీతిపై సిఎం మాట్లాడారు. దొర మాత్రమే సిఎం కావాలి అని అవమానించారు అని.. మైనింగ్ శాఖలో అవినీతి నిగ్గు తేల్చేందుకు తాము డిసైడ్ అయ్యామని తెలియజేశారు. మాజీ సిఎం కేబినెట్ కూర్పు చూస్తే ఎస్సీలపై వ్యతిరేకత కనిపిస్తోందని, బిఆర్ఎస్ డిఎస్ఎ లోనే ఎస్సిలపై వ్యతిరేకత ఉందని అన్నారు. హౌజ్ కమిటీ సిఫారసులు మళ్లీ సిబిసిఐడి కి ఇవ్వాల్సిందే అని సూచించారు. సిబిఐసిఐడి వద్దు అంటే సిబిఐ విచారణ అడుగుతారా.. చెప్పండి? అని రేవంత్ ప్రశ్నించారు. నువ్వు చేసిన పనికి నేను ఇరుక్కున్నా అని.. శనివారం రాత్రి బిఆర్ఎస్ మాజీ మంత్రి హరీష్ రావుపై బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ దాడి చేశారని పేర్కొన్నారు. ఎస్సిలపై కక్ష సాధింపు తప్ప కనీస మానవత్వం చూపలేదని విమర్శించారు.
బిఆర్ఎస్ హయంలో సిఎం మాజీసిఎం కెసిఆర్..ఆర్థిక మంత్రి హరీష్ రావు..మున్సిపల్ మంత్రి కెటిఆర్ అని ఎద్దేవా చేశారు. రెండు కోతులు కలిసి సభను చెరపాలని అనుకుంటున్నారు అని.. మంత్రి పొంగులేటి అయినా..రేవంత్ కుటుంబం అయినా సిబిసిఐడి ముందు ఆధారాలు పెట్టండి అని సూచించారు. జీతం తీసుకుంటూ సభకు రాని కెసిఆర్ రాజీనామా చేయడు అని అన్నారు. 4 లక్షల ఇండ్లు కట్టించిన పొంగులేటి రాజీనామా చేయాలా? అని ప్రశ్నించారు. వాళ్లకు మైక్ ఇవ్వండి అని..ఎంత మాట్లాడినా సమయం ఇవ్వండి అని అన్నారు.
కెసిఆర్ కు సమానంగా ప్రజా జీవితం నుంచి కాంగ్రెస్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి వచ్చారు అని.. కడియం నీతి, నిబద్ధతను దేశంలో ఎవరూ ప్రశ్నించలేదు అని అన్నారు. అసభ్యకరంగా, అసహ్యంగా ప్రవర్తిస్తే హరీష్ రావు, కెటిఆర్ సమర్థిస్తారా? అని ప్రశ్నించారు. పాడి కౌశిక్ రెడ్డి పై చర్యలు తీసుకోవాలి అని..కడియంకు జరిగిన అవమానమే కెసిఆర్ కు ఎదురైతే పరిస్థితి ఏంటి? అని నిలదీశారు. కౌశిక్ రెడ్డి సభ్యత్వం తీసుకోవాలని తమ సభ్యులు కోరుతున్నారు అని.. కౌశిక్ రెడ్డి వ్యవహారంపై ఎథిక్స్ కమిటీని సిఫారసు చేశారు అని అన్నారు. హరీష్ రావు సూచన మేరకు కమిటీ వేయండి అని రేవంత్ కోరారు.