
ఐపిఎల్ 2026లో భాగంగా జరుగుతున్న రెండో లీగ్ మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ జట్టుకు కోల్ కతా నైట్ రైడర్స్ 221 పరుగుల భారీ లక్ష్క్ష్యాన్ని నిర్ధేశించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేపట్టి కోల్ కతా బ్యాటర్స్ అదరగొట్టారు. ఓపెనర్లు అజింక్యా రహానె(67), ఫిన్ అలెన్(37)లు శుభారంభాన్ని అందించారు. తర్వాత రఘువంశీ(51) అర్ధ శతకంతో మెరుపులు మెరిపించాడు. చివర్లలో రింకూ సింగ్(33 నాటౌట్)కూడా ధనాధన్ బ్యాటింగ్ తో అలరించాడు. దీంతో కోల్ కతా 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 220 పరుగులు చేసింది.