
అడివి శేష్, మృణాల్ ఠాకూర్ జంటగా షానియల్ డియో తెరకెక్కిస్తున్న చిత్రం ‘డెకాయిట్’. బాలీవుడ్ ఫిల్మ్ మేకర్ అనురాగ్ కశ్యప్ కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఇప్పటికే విడుదలైన టీజర్, ఫస్ట్ సాంగ్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. శనివారం ‘చిచ్చు బుడ్డి’ అంటూ సాగే సెకండ్ సాంగ్‌ను రిలీజ్ చేశారు. భీమ్స్ సిసిరోలియో కంపోజ్ చేసిన మాస్ సాంగ్‌కు భాస్కరభట్ల రవికుమార్ క్యాచీ లిరిక్స్‌ను రాశారు.
పాప్ సింగర్ జోనిత గాంధీ.. రామ్ మిరియాలతో కలిసి పాడటంతోపాటు శేష్‌తో చేసిన డ్యాన్స్ మూమెంట్స్ స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచాయి. ‘భూమ్ భూమ్ బూమరాంగు.. ఎగరేస్తా పట్టుకోండి చీరకొంగు.. తేనెలో ముంచి తీసా ఒంటి రంగు.. ఒప్పుకో చుట్టూ తిప్పుకో.. మూడు లెక్కపెట్టేలోపు వచ్చి లొంగిపో.. ’ అంటూ సాగిన పాటలో అడివి శేష్ ఫస్ట్ టైమ్ డ్యాన్స్ ఫ్లోర్‌పై ఎనర్జిటిక్ స్టెప్స్‌తో అలరించాడు.
తనతోపాటు జోనిత గాంధీ అందరినీ ఆకట్టుకునే మాస్ వైబ్‌ను నింపింది. భోజ్‌పురి సింగర్ పవన్ సింగ్, మ్యూజిక్ డైరెక్టర్ భీమ్స్ సిసిరోలియో స్పెషల్ అప్పియరెన్స్ ఇచ్చారు. బార్ సెట్‌లో కొరియోగ్రఫీ చేసిన ఈ పాట ఒక సెలబ్రేషన్ సాంగ్‌లా ఆకట్టుకుంది. అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో సుప్రియా యార్లగడ్డ నిర్మిస్తున్న ఈ చిత్రానికి సునీల్ నారంగ్ సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఏప్రిల్ 10న సినిమా విడుదల కానుంది.