Reading Time: 2 minutes

మన తెలంగాణ/హైదరాబాద్ : తల్లిదండ్రులను చూసుకోలేని వా రిని సమాజం బహిష్కరిం చాలని, ఇది ఒక సామా జిక బాధ్యత అని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నా రు. తల్లిదండ్రులను పట్టించుకోని ఉద్యోగి వేతనం నుంచి.. రూ.10 వేల వరకు నేరుగా తల్లిదండ్రుల ఖాతాలో జమ య్యేలా సభలో బిల్లు పెట్టి చట్టం తీసుకవస్తున్నామని సీఎం వివరించారు. తల్లి దండ్రుల సంరక్షణ చట్టం బిల్లుకు ఆమోదం తెలుపాలని సీఎం రేవంత్‌రెడ్డి అన్ని పక్షాలకు పిలుపుఇచ్చారు. అసెంబ్లీలో ఆదివారం ఈ బిల్లుపై చర్చ అనంతరం సభ ఆ మోదించింది. ఇది కేవలం ప్రభు త్వ ఉద్యోగులకే కాకుండా ప్రజాప్రతినిధులను కూడా దీని పరిధిలోకి తీసుకవస్తున్నామని సీఎం తెలిపారు. పిల్లల హక్కుల కోసం, మహి ళల భద్రత కోసం అనేక చట్టాలు ఉన్నప్పటికీ, వృద్ధ తల్లిదండ్రుల సంరక్షణలో ఇంకా నిర్లక్ష్యం కొనసాగుతోం దని సీఎం ఆందోళన వ్యక్తం చేశారు. వృద్ధుల కోసం కేంద్రం 2007లో ఒక చట్టం తెచ్చిందని గుర్తు చేశారు. ప్రస్తుత కేంద్ర చట్టం ప్రకారం తల్లిదండ్రులకు రూ.10 వేలకు మించి ఇచ్చే అవకాశం లేదని అన్నారు. తల్లిదం డ్రులను చూసుకోని పిల్లల్లో భయం కలిగించేందుకే ఈ కొత్త చట్టాన్ని తీసుకువస్తున్నామని అన్నారు.

తల్లిదండ్రుల బాగోగులను చూసుకోలేని వారిని సమాజం బహిష్కరిం చాలని, ఇది కేవలం చట్టం మాత్రమే కాదు, ఒక సామా జిక బాధ్యత అని సీఎం పిలుపు నిచ్చారు. అడ్డాల నాడే బిడ్డలు తప్ప గడ్డాల నాడు కాదు. అనే సామెత నిజం కాకూడదని, బతికున్నప్పుడు గుప్పె డు మెతుకులు పెట్టని బిడ్డలు చనిపోయాక ఆస్తుల కోసం కొట్లాడుకోవడం కన్నా ఘోరం మరొకటి లేదని ఆవేదన వ్యక్తం చేశారు. పురాణాలలో మాతృ పితృ భక్తికి శ్రవణ కుమారుడి కథ అద్దం పడుతోందని, అయితే ప్రఖ్యాత ‘రేమండ్స్’ బ్రాండ్ మాజీ అధినేత విజయ్ పథ్ సింఘానియా (87) మరణంపై స్పందిస్తూ ఒక పారిశ్రామికవేత్తగా వెయ్యి కోట్ల సామ్రాజ్యాన్ని నిర్మించిన ఆయన, చివరి రోజుల్లో అనామికుడిగా తనువు చాలిం చడం అత్యంత విషాదకరమన్నారు. తన ఆస్తి మొత్తాన్ని గిఫ్ట్ డీడ్ ద్వారా కుమారుడు గౌతమ్ సింఘానియాకు అప్పగించిన తర్వాత, కన్న తండ్రి ని ఇంటి నుండి బయటకు పంపేయడం, కారు, డ్రైవర్ సౌకర్యాలను కూడా తొలగిం చడం ఆధునిక సమాజపు క్రూరత్వానికి అద్దం పడు తోందని ఆవేదన వ్యక్తం చేశారు. పిల్లలకు సర్వస్వం ఇచ్చేసి నేను పెద్ద తప్పు చేశానని ఆయన తన ఆత్మకథలో రాసుకోవడం ప్రతి తల్లిదండ్రులకూ ఒక హెచ్చరిక అని వెల్లడిం చారు. ఒకప్పుడు ఉమ్మడి కుటుంబాలు ఉండేవని, ఈరోజుల్లో పరిస్థితులు మారిపోయాయని చెప్పారు.

కుటుంబ నియంత్రణతో ఒక్కరో ఇద్దరికో పరిమితం అయ్యామని అన్నారు. ఆడ బిడ్డలకు తల్లిదండ్రులకు ప్రేమ ఉన్నా మెట్టినింటి బాధ్యతలతో ఏమీ చేయలేకపోతున్నారని వివరి ంచారు. తనకు తెలిసిన ఒక ప్రజాప్రతినిధి తండ్రికి క్యాన్సర్ వస్తే ఆయనను చూసుకోకుండా నిర్లక్ష్యం చేశారన్నారు. ఇటీవలే ఆ తండ్రి మరణిం చారని విచారించారు. తల్లిదండ్రులను చూసుకోలేని వారిని సమాజం బహిష్కరించాలని పిలుపునిచ్చారు. ఏ తల్లిదండ్రులు అనాథలుగా ఉండకూ డదన్నదే ఈ బిల్లు ప్రధాన ఉద్దేశమని స్పష్టం చేశారు. తాము తెచ్చిన చట్టం ప్రభుత్వ ఉద్యోగు లకే కాదని, ప్రజా ప్రతినిధులకు కూడా వర్తిస్తుందని పేర్కొన్నారు. తల్లిదండ్రుల యోగక్షేమాలు చూడని వ్యక్తిని సామాజికంగా బహిష్కరించాలని పిలుపునిచ్చారు. తల్లిదం డ్రులను చూసు కోలేనోడు – సమాజంలో బతకడానికి వీల్లేదని అన్నారు. సామాజిక బాధ్యతగా ఈ చట్టాన్ని తీసుకువచ్చామన్నారు. ఈ చట్టంతో సమస్యలన్నీ పరిష్కారం అవుతాయని కాదు, ఈచట్టంతో వృద్ధ తల్లిదండ్రులకు న్యాయం జరుగుతుందనే నమ్మకం కలిగించేందుకే తమ ప్రయత్నం అని చెప్పారు.