Reading Time: 2 minutes
Migraine In Women Causes Symptoms And Prevention Tips Are

Migraine in Women: గత కొంతకాలంగా చాలామంది మహిళలు మైగ్రేన్ సమస్యతో తెగ ఇబ్బందులు పడుతున్నారు. నిజానికి మైగ్రేన్ అనేది సాధారణ తలనొప్పి కాదు. ఇది తరచుగా వస్తూ.. తల నొప్పి ఎక్కవుగా తీవ్రంగా ఉంటుంది. ఇది సాధారణ తలనొప్పికి భిన్నంగా, తరచుగా తలలోని ఒక భాగంలో కొట్టుకుంటున్నట్లుగా నొప్పిని కలిగిస్తుంది. మైగ్రేన్ సమయంలో వాంతులు, మలబద్ధకం, వెలుతురు, శబ్దానికి అసహనం వంటి లక్షణాలు కనిపిస్తాయి. కొందరికి తల తిరగడం, బలహీనత కూడా ఉండడం చూడవచ్చు.

Gold Rates: యుద్ధం వేళ మగువలకు శుభవార్త.. దిగొచ్చిన బంగారం ధరలు

అనారోగ్యకరమైన జీవనశైలి, అధిక ఒత్తిడి, సరైన నిద్రలేమి ఉన్న మహిళల్లో మైగ్రేన్ వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా హార్మోన్ల మార్పులు కూడా దీనికి ప్రధాన కారణం. పీరియడ్స్, గర్భధారణ లేదా మెనోపాజ్ సమయంలో హార్మోన్ల మార్పుల వల్ల మైగ్రేన్ తీవ్రత పెరిగే అవకాశం ఉంటుంది. ఈ సమస్యను నిర్లక్ష్యం చేస్తే క్రమంగా తీవ్రమవుతుంది. ఇవే కాదు మైగ్రేన్‌ కు మరిన్ని కారణాలు కూడా ఉన్నాయి. ఎక్కువగా ఆందోళన చెందడం, మానసిక ఒత్తిడి ఈ సమస్యను పెంచుతాయి. అలాగే రాత్రిళ్లు ఆలస్యంగా నిద్రపోవడం, సరైన విశ్రాంతి లేకపోవడం కూడా మైగ్రేన్‌కు దారి తీస్తాయి. కొంతమందిలో ఎక్కువసేపు మొబైల్ లేదా కంప్యూటర్ స్క్రీన్ చూడటం, గట్టిగా శబ్దం వినడం కూడా మైగ్రేన్‌ ను ట్రిగర్ చేస్తాయి.

అలాగే ఆహారపు అలవాట్లు కూడా కీలక పాత్ర పోషిస్తాయి. ఎక్కువసేపు ఆకలిగా ఉండటం, జంక్ ఫుడ్ ఎక్కువగా తీసుకోవడం వలన మైగ్రేన్ సమస్య పెరిగే అవకాశం ఉంది. ఈ అన్ని కారణాలు కలిపి సమస్యను మరింత తీవ్రతరం చేస్తాయి. మైగ్రేన్‌ను నియంత్రించడానికి కొన్ని సాధారణ జాగ్రత్తలు తీసుకోవడం చాలా అవసరం. ప్రతిరోజూ ఒక మంచి జీవనశైలిని పాటించడం, సమయానికి నిద్రపోతూ.. తగినంత నిద్ర తీసుకోవడం ముఖ్యము. ఒత్తిడిని తగ్గించడానికి యోగా, ధ్యానం చేయడం మంచిది. ఎక్కువసేపు స్క్రీన్ ముందు ఉండకుండా మధ్య మధ్యలో కళ్లకు విశ్రాంతి ఇవ్వాలి.

Jowar Halwa Recipe: స్వీట్ క్రేవింగ్స్‌కు బెస్ట్ ఆప్షన్ ‘జొన్నపిండి హల్వా’.. ఇంట్లోనే చేసేయండి ఇలా.!

ఇంకా ఆహారంపై కూడా శ్రద్ధ పెట్టాలి. ఎక్కువసేపు ఖాళీ కడుపుతో ఉండకూడదు. రోజుకు తగినంత నీరు తాగడం కూడా అవసరం. ఈ చిన్న చిన్న అలవాట్లు మైగ్రేన్ ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడతాయి. అయితే మైగ్రేన్ తరచుగా వస్తుంటే దాన్ని నిర్లక్ష్యం చేయకుండా వైద్యుడిని సంప్రదించడం చాలా ముఖ్యం. మైగ్రేన్‌ను ప్రేరేపించే కారణాలను గుర్తించి వాటికి దూరంగా ఉండాలి. క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం, శరీరాన్ని చురుకుగా ఉంచడం అవసరం.