
అక్షయ్ ఖన్నా పుట్టినరోజు సందర్భంగా, దర్శకుడు ప్రశాంత్ వర్మ ‘మహాకాళి’ సెట్స్ నుంచి ఒక కొత్త స్టిల్‌ను విడుదల చేశారు. ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ (పివిఎస్‌యు)లో ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ చాప్టర్ గురించి ఒక ఆసక్తికరమైన అప్‌డేట్‌ను ఇచ్చారు. ఆర్కేడీ స్టూడియోస్ బ్యానర్‌పై ఆర్కే దుగ్గల్, రివాజ్ రమేష్ దుగ్గల్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి, ప్రశాంత్ వర్మ షోరన్నర్‌గా వ్యవహరిస్తుండగా, పూజా కొల్లూరు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం భారతీయ సినిమా రంగంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన పౌరాణిక చిత్రాలలో ఒకటిగా నిలుస్తోంది. చిత్ర బృందం 100 రోజుల షూటింగ్‌ను విజయవంతంగా పూర్తి చేయగా, చివరి 40 రోజుల షెడ్యూల్ హైదరాబాద్‌లో ప్రారంభమైంది. శుక్రాచార్యుడి కీలక పాత్ర కోసం అక్షయ్ ఖన్నా తన చిత్రీకరణను పూర్తి చేశారు. నిర్మాతలు త్వరలో విడుదల తేదీని ప్రకటించనున్నారు. మల్టీ స్టూడియోల వీఎఫ్‌ఎక్స్ పనులు శర వేగంతో సాగుతున్నాయి. ఈ చిత్రంలో భూమి శెట్టి టైటిల్ పాత్రలో నటిస్తున్నారు. ఆమె ఉగ్రరూపంలో కనిపించిన ఫస్ట్-లుక్‌కు అద్భుతమైన స్పందన వచ్చింది. శుక్రాచార్యుడిగా అక్షయ్ ఖన్నా టాలీవుడ్ అరంగేట్రం భారీ అంచనాలను రేకెత్తించగా, అతని ఫస్ట్ లుక్‌కు కూడా సోషల్ మీడియాలో అద్భుతమైన ప్రశంసలు లభించాయి.