
హైదరాబాద్, వెలుగు: బీసీ అనుబంధ కార్పొరేషన్లు, ఫెడరేషన్లకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. 2025–26 బడ్జెట్ లో వాటికి కేటాయించిన నిధులకు అడ్మినిస్ర్టేటివ్ సాంక్షన్ ఇస్తూ బీసీ సంక్షేమశాఖ ఇన్ చార్జి ప్రిన్సిపల్ సెక్రటరీ రఘనందన్ రావు ఉత్తర్వులు జారీ చేశారు. ఈ కార్పొరేషన్లు, ఫెడరేషన్లకు గత బడ్జెట్ లో రూ.2,257 కోట్లు కేటాయించగా, ఇందులో రెండో త్రైమాసికం కింద రూ.564.25 కోట్లకు పరిపాలన అనుమతులు ఇచ్చింది.
ఇంకా రూ.1,006.27 కోట్లు విడుదల చేయాల్సి ఉంది. ఇందులో అత్యధికంగా బీసీ కో–ఆపరేటివ్ ఫైనాన్స్ కార్పొరేషన్ లిమిటెడ్ కు రూ.164.25 కోట్లు, ఎంబీసీ కార్పొరేషన్ కు రూ.100 కోట్లు, రజకుల కరెంట్ సబ్సిడీకి రూ.37.5 కోట్లు ఉండగా, మిగతా కార్పొరేషన్లకు ఒక్కొక్కదానికి రూ.12.5 కోట్ల రిలీజ్ కు అనుమతి ఇచ్చారు.