
Suryakumar Yadav: ఐపీఎల్ 2026 సీజన్ రెండో మ్యాచ్‌లో భాగంగా ముంబైలోని వాంఖడే స్టేడియంలో కోల్‌కతా నైట్ రైడర్స్‌తో తలపడుతున్న ముంబై ఇండియన్స్ జట్టులో ఒక కీలక మార్పు అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. భారత టీ20 ప్రపంచ కప్ విజేత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ పేరు తుది జట్టులో లేకపోవడం అభిమానులను కాస్త ఆందోళనకు గురి చేసింది. అయితే, అతను మ్యాచ్‌కు దూరం కాలేదని, ముంబై వ్యూహాత్మక నిర్ణయంలో భాగంగానే ఇలా జరిగిందని సమాచారం.
సూర్య ఎందుకు లేరంటే?:
ముంబై ఇండియన్స్ మొదట బౌలింగ్ ఎంచుకోవడంతో, తమ అత్యుత్తమ బౌలింగ్ విభాగంతో బరిలోకి దిగింది. సూర్యకుమార్ యాదవ్ పేరును ‘ఇంపాక్ట్ సబ్‌స్టిట్యూట్’ జాబితాలో చేర్చారు. ఐపీఎల్ నిబంధనల ప్రకారం, రెండో ఇన్నింగ్స్‌లో ముంబై బ్యాటింగ్‌కు వచ్చే సమయంలో సూర్యకుమార్ యాదవ్ ఖచ్చితంగా మైదానంలోకి అడుగు పెడతాడు. ఓవర్ ముగిసినప్పుడు లేదా వికెట్ పడినప్పుడు అతను జట్టులోకి వచ్చే అవకాశం ఉంది.
ముంబైకి ఇద్దరు విదేశీ స్టార్ల దూరం:
ఈ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ ఇద్దరు కీలక విదేశీ ఆటగాళ్ల సేవలను కోల్పోతోంది. న్యూజిలాండ్ కెప్టెన్ మిచెల్ సాంట్నర్, ఇంగ్లాండ్ ఆల్ రౌండర్ విల్ జాక్స్ వ్యక్తిగత కారణాలతో విరామం కోరడంతో ఈ మ్యాచ్‌లో వాళ్లు ఆడటం లేదు. ఈ విషయాన్ని జట్టు ప్రధాన కోచ్ మహేల జయవర్ధనే ధ్రువీకరించారు. అలాగే సొంత మైదానంలో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో బలమైన బౌలింగ్, బ్యాటింగ్ విభాగంతో ముంబై ఇండియన్స్ ఈ సీజన్‌ను విజయంతో ప్రారంభించాలని పట్టుదలతో ఉంది. రెండో ఇన్నింగ్స్‌లో సూర్యకుమార్ యాదవ్ బ్యాటింగ్‌తో మెరుపులు మెరిపిస్తాడని అభిమానులు ఆశిస్తున్నారు.
►ALSO READ | IPL 2026: ఐపీఎల్కి ధోనీ తర్వాత CSK నుంచి మరో స్టార్ ప్లేయర్ ఔట్
ముంబై ఇండియన్స్ జట్టు:
రోహిత్ శర్మ, ర్యాన్ రికెల్టన్ (వికెట్ కీపర్), తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా (కెప్టెన్), షెర్ఫేన్ రూథర్‌ఫోర్డ్, నమన్ ధీర్, శార్దూల్ ఠాకూర్, మయాంక్ మార్కండే, అల్లా గజన్ఫర్, ట్రెంట్ బౌల్ట్, జస్ప్రీత్ బుమ్రా.
ఇంపాక్ట్ ప్లేయర్స్ (అదనపు ఆటగాళ్లు):
సూర్యకుమార్ యాదవ్, కార్బిన్ బాష్, రాబిన్ మింజ్, రాజ్ బావా, అశ్విని కుమార్.
A 𝑩𝑰𝑮 opening game tonight. Here is our 𝗽𝗹𝗮𝘆𝗶𝗻𝗴 𝗫𝗜! 💙
𝑺𝒉𝒂𝒓𝒅𝒖𝒍, 𝑺𝒉𝒆𝒓𝒇𝒂𝒏𝒆 & 𝑮𝒉𝒂𝒛𝒂𝒏𝒇𝒂𝒓 make their debut in Blue & Gold 🤩 pic.twitter.com/KeI35kdx6z
— Mumbai Indians (@mipaltan) March 29, 2026