Reading Time: < 1 minute

వరంగల్ 2 డిపోలో ఎలక్ట్రిక్‍ బస్సులో మంటలు

Caption of Image.

గ్రేటర్ వరంగల్‍, వెలుగు: వరంగల్_2 డిపోలో ఆదివారం తెల్లవారుజామున ఆగిఉన్న ఎలక్ట్రిక్‍ బస్సులో మంటలు చెలరేగాయి. అప్రమత్తమైన ఆర్టీసీ, ఫైర్‍ సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. షార్ట్​ సర్క్యూట్‍ కారణంగా ప్రమాదం జరిగినట్లు భావించారు. 

కాగా, డిపో మేనేజర్‍ రవి మాట్లాడుతూ బస్సుల్లో 12 బ్యాటరీలు ఉంటాయని, అందులో ఒకదాంట్లో మంటలు రాగా, వెంటనే ఆర్పేశామని చెప్పారు. ఎటువంటి ప్రమాదం, నష్టం జరగలేదని తెలిపారు. 

©️ VIL Media Pvt Ltd.