Reading Time: 2 minutes
Ration Card New Rules: రేషన్ కార్డు వినియోగదారులకు అలర్ట్.. ఏప్రిల్ 1 నుండి కొత్త నిబంధనలు.. ఈ తప్పులు చేస్తే కార్డు రద్దే!

Ration Card New Rules: మీరు కొత్త రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేయాలనుకుంటున్నారా? లేదా ఇప్పటికే ఉన్న కార్డుతో ప్రయోజనాలు పొందుతున్నారా? అయితే కేంద్ర ప్రభుత్వం ఏప్రిల్ 1, 2026 నుండి అమలు చేయబోతున్న సరికొత్త నిబంధనల గురించి మీరు తప్పనిసరిగా తెలుసుకోవాలి. రేషన్ పంపిణీలో పారదర్శకత పెంచేందుకు మరియు అనర్హులను తొలగించేందుకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.

LPG Booking: దేశంలో గ్యాస్‌ బుకింగ్‌ నిబంధనలు మారాయని మీకు తెలుసా? ఇలా చేస్తే సిలిండర్‌ అందదు!

1. e-KYC తప్పనిసరి: గడువు గుర్తుంచుకోండి!

  • రేషన్ కార్డులో ఉన్న ప్రతి సభ్యుడు తప్పనిసరిగా e-KYC పూర్తి చేయాలి.
  • పద్ధతి: మీ సమీపంలోని రేషన్ షాపుకు వెళ్లి బయోమెట్రిక్ (వేలిముద్ర) వేయడం ద్వారా లేదా ‘మేరా రేషన్’ యాప్ ద్వారా ఫేస్ అథెంటికేషన్ ఉపయోగించి మీ KYC ని పూర్తి చేసుకోవచ్చు.
  • కేవైసీ  పూర్తి చేయకపోతే ఏప్రిల్ 1 నుండి మీ రేషన్ నిలిచిపోతుంది.

2. ఆదాయ పరిమితిలో మార్పు

  • కొత్త రేషన్ కార్డు దరఖాస్తుదారులకు వార్షిక ఆదాయ పరిమితిని పెంచారు. ఉదాహరణకు ఢిల్లీ వంటి రాష్ట్రాల్లో దీనిని రూ. 1 లక్ష నుండి రూ. 1.20 లక్షలకు పెంచారు. 18 ఏళ్లు పైబడిన మహిళను మాత్రమే కుటుంబ పెద్దగా పరిగణిస్తారు.

3. పూర్తి డిజిటల్ ప్రక్రియ

  • ఇకపై రేషన్ కార్డు కోసం కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన పనిలేదు.
  • దరఖాస్తు ప్రక్రియ ఇప్పుడు పూర్తిగా ఆన్‌లైన్‌లోనే జరుగుతుంది.
  • అవసరమైన పత్రాలు: అందరి సభ్యుల ఆధార్ కార్డులు, ఆదాయ ధృవీకరణ పత్రం, కరెంటు బిల్లు లేదా నివాస ధృవీకరణ పత్రం.
  • మీరు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసిన తర్వాత, ఫుడ్ సప్లై ఆఫీసర్ (FSO) మీ ఇంటికి వచ్చి ధృవీకరణ చేసిన తర్వాతే కార్డు జారీ అవుతుంది.

4. ఒకేసారి 3 నెలల రేషన్

  • కొత్త నిబంధనల ప్రకారం లబ్ధిదారుల సౌకర్యార్థం కొన్ని రాష్ట్రాల్లో ఒకేసారి మూడు నెలల కోటాను పొందే వెసులుబాటు కల్పించారు. దీనివల్ల ప్రతి నెలా క్యూలలో నిలబడాల్సిన ఇబ్బంది తప్పుతుంది.

5. మీ కార్డు రద్దు అయ్యే కారణాలు (జాగ్రత్త!)

ఈ క్రింది పరిస్థితుల్లో మీ రేషన్ కార్డు రద్దయ్యే అవకాశం ఉంది:

  • కుటుంబంలో ఎవరైనా ఆదాయపు పన్ను (Income Tax) చెల్లిస్తుంటే.
  • మీ వద్ద నాలుగు చక్రాల వాహనం (ట్రాక్టర్ మినహా) ఉంటే.
  • వరుసగా 3 నెలల పాటు రేషన్ తీసుకోకపోతే ప్రభుత్వం మీ పేరును తొలగిస్తుంది.
  • సభ్యులు మరణించినా లేదా వివాహమై వెళ్లిపోయినా వారి పేర్లను తొలగించకపోతే మొత్తం కార్డుకే ప్రమాదం ఏర్పడవచ్చు.

LPG Gas Booking: ఎల్‌పీజీ గ్యాస్‌ బుకింగ్‌లో ఇలాంటివి అస్సలు నమ్మకండి.. సులభమైన పద్దతులు మీకు తెలుసా?

మరిన్ని బిజినెస్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి