Reading Time: 2 minutes
JEE Main 2026 Admit Card: జేఈఈ మెయిన్‌ సెషన్‌ 2 అడ్మిట్‌ కార్డులు విడుదల.. డైరెక్ట్‌ డౌన్‌లోడ్‌ లింక్‌ ఇదే

హైదరాబాద్‌, మార్చి 30: జేఈఈ మెయిన్‌ సెషన్‌ 2 ఆన్‌లైన్‌ పరీక్షలు మరో రెండు రోజుల్లో ప్రారంభం కానున్నాయి. ఈ క్రమంలో ఈ పరీక్షలకు సంబంధించిన అడ్మిట్‌ కార్డులను నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ (NTA) తాజాగా విడుదల చేసింది. జేఈఈ మెయిన్‌ పరీక్షకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్ధులు అధికారిక వెబ్‌సైట్‌లో తమ వివరాలతో లాగిన్‌ అయ్యి అడ్మిట్ కార్డులను డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. అభ్యర్ధులు డౌన్‌లోడ్‌ చేసుకున్న అడ్మిట్ కార్డులపై స్పష్టంగా కనిపించేలా క్యూఆర్ కోడ్, బార్‌కోడ్ ఉన్నాయో లేదో నిర్ధారించుకోవాలి. దరఖాస్తు ప్రక్రియలో సమర్పించిన ఐడీ ప్రూఫ్‌ను పరీక్ష కేంద్రానికి తప్పనిసరిగా తీసుకెళ్లాలి. అడ్మిట్ కార్డును డౌన్‌లోడ్ చేసుకోవడంలో ఏమైనా ఇబ్బంది ఎదురైతే 011-40759000 నంబర్‌ ద్వారా NTA హెల్ప్‌లైన్‌ను సంప్రదించవచ్చు లేదా ఏజెన్సీ అందించిన అధికారిక ఇమెయిల్ ఐడీ ద్వారా సంప్రదించవచ్చు.

జేఈఈ మెయిన్‌ సెషన్‌ 2 అడ్మిట్‌ కార్డుల డౌన్‌లోడ్‌ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఏప్రిల్‌ 2, 4 తేదీల్లో జరగనున్న పరీక్షలకు సంబంధించిన అడ్మిట్‌ కార్డుల్ని ప్రస్తుతం అందుబాటులోకి తీసుకువచ్చింది. ఆ తర్వాత తేదీల్లో జరిగే పరీక్షల అడ్మిట్‌ కార్డులు కూడా త్వరలోనే విడుదల చేయనున్నట్లు ఎన్టీయే వెల్లడించింది. కాగా జేఈఈ మెయిన్‌ సెషన్‌2 పరీక్షలు 2, 4, 5, 7, 8 తేదీల్లో దేశ వ్యాప్తంగా పలు పరీక్ష కేంద్రాల్లో నిర్వహించనున్నారు. దేశం వెలుపల విదేశాల్లోని 15 నగరాల్లోనూ ఈ పరీక్షలు నిర్వహిస్తున్నారు. సెషన్ 2 పరీక్షకు హాజరయ్యే విద్యార్ధులు పరీక్షకు ముందు తమ అడ్మిట్ కార్డులను డౌన్‌లోడ్‌ చేసుకోవల్సి ఉంటుంది. అందులోని సూచనల మేరకు పరీక్ష కేంద్రానికి హాజరవ్వాలి. ఆయా తేదీల్లో పేపర్‌ 1 పరీక్షలు రోజుకు రెండు షిఫ్టుల్లో జరుగుతాయి. మొదటి షిఫ్టు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, రెండో షిఫ్ట్‌ మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు నిర్వహిస్తారు. ఇక ఏప్రిల్‌ 5, 6, 7, 8 తేదీల్లో నిర్వహించే పరీక్షకు సంబంధించిన అడ్మిట్‌ కార్డులను ఆ తర్వాత విడుదల చేయనున్నారు. ఈ తేదీలలో పేపర్ 1 (BE/BTech), పేపర్ 2A (BArch), పేపర్ 2B (B Planning) కలిపి పేపర్ 2A, 2B ఉంటాయి.

జేఈఈ మెయిన్‌ సెషన్‌ 2 అడ్మిట్‌ కార్డుల డౌన్‌లోడ్‌ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

జేఈఈ మెయిన్ 2026 సెషన్‌ 2 అడ్మిట్ కార్డుల డౌన్‌లోడ్‌ ఇలా..

  • ముందుగా జేఈఈ మెయిన్ అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించాలి
  • స్క్రీన్‌పై కనిపించే సెషన్‌ 2 అడ్మిట్‌ కార్డు లింక్‌పై క్లిక్ చేయాలి.
  • క్యాండిడేట్‌ లాగిన్‌ పేజీ ఓపెన్‌ అవుతుంది.
  • ఇందులో అప్లికేషన్‌ నంబర్‌, పాస్‌వర్డ్‌ లేదా పుట్టిన తేదీ వివరాలను ఎంటర్‌ చేసి లాగిన్‌ అవ్వాలి.
  • వెంటనే అడ్మిట్‌ కార్డు స్క్రీన్‌పై కనిపిస్తుంది.
  • పీడీఎఫ్‌ రూపంలో డౌన్‌లోడ్‌ చేసుకుని, సేవ్‌ చేసుకోవాలి.

జేఈఈ మెయిన్‌ సెషన్‌ 2 అడ్మిట్‌ కార్డుల డౌన్‌లోడ్‌ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్‌ చేయండి.