
అమరావతి: ఇద్దరు వ్యక్తులు దారుణ హత్యకు గురైన సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా కొడవలూరు మండలంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. దస్తగిరి మండలానికి చెందిన వెంకటేశ్(29), సంగం మండలానికి చెందిన బాలవెంకయ్య(26) అనే యువకులను గండవరం సమీపంలోని పొలాల్లో హత్య చేశారు. గ్రామస్థుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతుడి శరీరంపై కత్తి పోట్లు ఉన్నాయని పోలీసులు వెల్లడించారు. పాత కక్షలు లేక వివాహేతర సంబంధాలతోనే హత్యలు జరిగాయా? అనే కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు.