Reading Time: < 1 minute

హైదరాబాద్: కాంగ్రెస్ పాలనలో భారీ కుంభకోణాలు జరిగాయంటూ బిఆర్ఎస్ పార్టీ నాయకులు తీవ్ర ఆరోపణలు చేశారు. గత రెండున్నరేళ్ల కాంగ్రెస్ పాలనలో దాదాపు అన్ని శాఖల్లో అక్రమాలు జరిగాయని ఆరోపించింది. ఆదివారం కాంగ్రెస్ అవినీతిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బిఆర్ఎస్ లేఖ రాసింది. ఈ కుంభకోణాలపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని లేఖలో పేర్కొంది. 19 అంశాలపై హౌస్‌ కమిటీ వేసి విచారణ జరపాలని కోరింది. అవినీతి, కుంభకోణాలపై లేఖ రాస్తే విచారణ జరిపిస్తానని సిఎం రేవంతే స్వయంగా అసెంబ్లీలో ప్రకటించారని తెలిపింది. విచారణ జరగాలంటే ఆరోపణలు ఎదుర్కొంటున్న వారు తక్షణమే రాజీనామా చేయాలని లేఖలో డిమాండ్ చేసింది.