
తల్లిదండ్రుల సంరక్షణ బిల్లు చరిత్రాత్మకమైనదన్నారు ఎమ్మెల్యే కూనంనేని. ఆధునిక సమాజంలో నిరాదరణకు గురౌతున్న తల్లిదండ్రుల సంరక్షణకు తీసుకొచ్చిన బిల్లుపై ఆదివారం అసెంబ్లీలో చర్చ జరిగింది. ఈ సందర్భంగా కూనంనేని మాట్లాడుతూ.. బిల్లు చిన్నదే అయినా దాని వెనక ఆత్మ.. ఆర్థ్రత చాలా గొప్పదన్నారు. సీఎం రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు.
►ALSO READ | సీఎం రేవంత్‌రెడ్డితో మేనకాగాంధీ భేటీ.. జంతు సంరక్షణ చర్యలపై హర్షం
ఉద్యోగస్తుల తల్లిదండ్రుల అంశమే కాకుండా.. సమాజంలో మార్పు రావడానికి , నైతికపరమైన అంశాల్లో మార్పు వచ్చే విధంగా వ్యక్తగత జాగ్రత్తలతో పాటు , పాఠ్యాంశాల ద్వారా చైతన్యం వచ్చేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రస్తుత సమాజంలో అమెరికన్, యూరోపియన్ కల్చర్ మనపై చాలా ఉంది.. పెళ్లిళ్లు అయిన వెంటనే తల్లిదండ్రులను వదిలిపెట్టి సంపాదన, వ్యక్తిగత అభివృద్ధిపై దృష్టిపెడుతున్నారు. ఉమ్మడికుటుంబం భావన సమాజంలో తగ్గింది. ఇలాంటి అంశాలను దృష్టిలో పెట్టుకొని సమాజంలో మార్పుకు కృషి చేయాలని ఎమ్మెల్యే కూనంనేని కోరారు.