Reading Time: < 1 minute

లారీ కిందపడి చిన్నారి మృతి ..మంచిర్యాల జిల్లా సీతారాంపల్లిలో ఘటన

Caption of Image.

నస్పూర్, వెలుగు : ఆడుకుంటున్న చిన్నారిపైకి లారీ దూసుకెళ్లడంతో అక్కడికక్కడే చనిపోయింది. ఈ ఘటన మంచిర్యాల జిల్లా నస్పూర్‌‌‌‌ మండలం సీతారాంపల్లిలోని ఇటుక బట్టీల వద్ద ఆదివారం జరిగింది. నస్పూర్‌‌‌‌ ఎస్సై ప్రశాంత్‌‌‌‌ తెలిపిన వివరాల ప్రకారం… బెల్లంపల్లి పట్టణ సమీపంలోని పెద్దబూదెకు చెందిన లింగంపల్లి రాజ్‌‌‌‌కుమార్‌‌‌‌ మౌనిక దంపతులు సీతారాంపల్లి గ్రామ సమీపంలోని ఇటుక బట్టీల్లో పనిచేస్తున్నారు.

ఆదివారం వారి చిన్న కూతురు మిల్కి (10 నెలలు) తన అక్కతో కలిసి బట్టీల సమీపంలో ఆడుకుంటోంది. ఇదే సమయంలో బట్టీల వద్దకు ఫ్లైయాష్‌‌‌‌ తీసుకొచ్చిన లారీ డ్రైవర్‌‌‌‌ చిన్నారిని గమనించకుండా లారీని రివర్స్‌‌‌‌ తీసే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలో లారీ టైర్‌‌‌‌ మిల్కీ తల పైనుంచి వెళ్లడంతో చిన్నారి అక్కడికక్కడే చనిపోయింది. 

©️ VIL Media Pvt Ltd.