
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) క్రికెట్ యొక్క 19వ ఎడిషన్ ఈ సాయంత్రం బెంగళూరులో ప్రారంభమైంది. ఎం. చిన్నస్వామి స్టేడియంలో జరిగిన ప్రారంభ మ్యాచ్‌లో, సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు, డిఫెండింగ్ ఛాంపియన్లైన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) ముందు 202 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. బ్యాటింగ్ ఆహ్వానం అందుకున్న సన్‌రైజర్స్ హైదరాబాద్, నిర్ణీత 20 ఓవర్లలో తొమ్మిది వికెట్లు కోల్పోయి 201 పరుగులు సాధించింది. మొదటి మ్యాచ్‌లో ఇషాన్ కిషన్(80) రెచ్చిపోయాడు. ఇషాన్ కిషన్(80: 38 బంతుల్లో 8 ఫోర్లు, 5 సిక్సర్లు) కెప్టెన్ ఇన్నింగ్స్‌తో చెలరేగాడు. హెన్రిచ్ క్లాసెన్(31) జతగా 97 పరుగుల కీలక భాగస్వామ్యం నెలకొల్పిన ఇషాన్ భారీ స్కోర్‌కు బాటలు వేశాడు. అనికేత్ వర్మ(43 18 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్సర్లు) దంచేశాడు.ఇషాన్, అనికేత్ మెరుపులతో ఆరెంజ్ ఆర్మీ ప్రత్యర్ధికి భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది.