Reading Time: < 1 minute

వీకెండ్‌ డ్రంక్ అండ్ డ్రైవ్‌..138 మందిపై కేసులు

Caption of Image.

సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో వీకెండ్‌ స్పెషల్ డ్రంక్ అండ్ డ్రైవ్ లో భాగంగా సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు విస్తృతంగా డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేపట్టారు.  ఈ డ్రైవ్‌లో భాగంగా 138 మందిని అదుపులోకి తీసుకొని కేసులు నమోదు చేశారు. 121 ద్విచక్ర వాహనదారులు,05 ఆటోలు,11 కార్లు, 01 హెవీ వాహనదారులపై కేసులు నమోదయ్యాయి.

డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడ్డ వారందరినీ చట్టపరంగా కోర్టుకు హాజరుపర్చనున్నట్లు సైబరాబాద్ ట్రాఫిక్ డిసిపి I రంజన్ రతన్ కుమార్  తెలిపారు.  మద్యం సేవించి డ్రైవింగ్‌ చేయటం తీవ్రమైన నేరమని అన్నారు. మద్యం మత్తులో వాహనం నడిపి ప్రమాదానికి కారణమైతే, భారతీయ న్యాయ సంహిత –2023లోని సెక్షన్‌ 105 (కల్పబుల్‌ హోమిసైడ్‌ నాట్‌ అమౌంటింగ్‌ టు మర్డర్‌) కింద కేసు నమోదు చేస్తామని తెలిపారు. ఈ నేరానికి గరిష్ట శిక్ష 10 ఏళ్ల జైలు, జరిమానా విధించే అవకాశం ఉందన్నారు. 

  గత వారం (మార్చి 23నుంచి28) లో మొత్తం 403 డ్రంక్‌ డ్రైవింగ్‌ కేసులను కోర్టులు పరిష్కరించాయని చెప్పారు. వీరిలో సోషల్‌ సర్వీస్,403 మందికి జరిమానా విధించబడినట్లు తెలిపారు.

©️ VIL Media Pvt Ltd.