Reading Time: < 1 minute
Dmk Election Manifesto 2026 Rs 2000 For Women Free Laptops And 10 Lakh Houses Promised By Mk Stalin

DMK manifesto: తమిళనాడు ఎన్నికల మానిఫెస్టో అంటేనే ప్రజలకు పెద్ద ఎత్తున హామీల వర్షాలు కురిపించడం. ఇప్పుడు తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు కొన్ని రోజులే మిగిలి ఉన్నాయి. ఈ నేపథ్యంలో అధికార డీఎంకే పార్టీ తన మానిఫెస్టోను విడుదల చేసింది. ఎప్పటిలాగే ఓటర్లను ఆకట్టుకోవడానికి ఉచితాలకు పెద్ద పీట వేశారు.

Read Also: Chiru158: మెగాస్టార్ సినిమాలో మాఫియా బ్యాక్‌డ్రాప్.. బాబీ కొల్లి ‘నెక్స్ట్ లెవల్’ ప్లాన్!

కుటుంబ పెద్దలైన మహిళలకు ఇచ్చే నెలవారీ సాయం రూ. 1000 నుంచి రూ. 2000లకు పెంచుతామని, వృద్ధాప్య పెన్షన్లను రూ. 2000లకు పెంచుతామని చెప్పారు. 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు వర్తిస్తున్న ప్రభుత్వ బ్రేక్ ఫాస్ట్ స్కీమ్‌ను 8వ తరగతి వరకు విస్తరిస్తామని చెప్పారు. ఉన్నత చదువులు చదివే 35 లక్షల మంది విద్యార్థులకు ఉచిత ల్యాప్‌టాప్‌లు పంపిణీ చేస్తామని హామీ ఇచ్చారు. రైతులకు ఉచితంగా పంప్ సెట్లు, మహిళా సంఘాలకు రూ. 5 లక్షల వరకు వడ్డీ లేని రుణాలు ఇస్తామని డీఎంకే హామీ ఇచ్చింది.

రాబోయే 5 ఏళ్లలో 10 లక్షల కొత్త ఇల్లు నిర్మిస్తామని, ముఖ్యమంత్రి ఆరోగ్య బీమా పథకం పరిమితిని రూ. 10 లక్షలకు పెంచుతామని చెప్పారు. 20 లక్షల మందికి ఉచిత విద్యుత్ సరఫరా కొనసాగిస్తామని మానిఫెస్టోలో పొందుపరిచారు. తమిళనాడును 12 బిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మారుస్తామని లక్ష్యంగా పెట్టుకున్నారు.