Reading Time: < 1 minute

హైదరాబాద్: సభా సంప్రదాయాలు తెలిసిన బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్, మాజీ మంత్రి హరీష్ రావు దారుణంగా వ్యవహరిస్తున్నారు అని డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్క ఆరోపించారు. అడిగిన వెంటనే సిబిఐసిడి విచారణకు ఆదేశించామని అన్నారు. తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో సభలో బిఆర్ఎస్ సభ్యుల తీరును భట్టి తప్పుబట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. బిఆర్ఎస్ పాలనలో వేసిన 3 హౌస్ కమిటీల నివేదికలు ఏమయ్యాయి? అని భట్టి ప్రశ్నించారు. గతంలో పలువురిని బ్లాక్ మెయిల్ చేసి బిఆర్ఎస్ లో చేర్చుకున్నారు అని.. ప్రభుత్వంపై బురద జల్లే ప్రయత్నాలు చేయడం సరికాదు అని విమర్శించారు. సభ హుందాతనాన్ని కాపాడాలి అని సూచించారు. సభలో ప్రజాసమస్యలపై చర్చ జరగకూడదని రాద్ధాంతం చేస్తున్నారు అని మండిపడ్డారు. మైనింగ్ అక్రమాలపై సిబిసిఐడీ విచారణకు ఆదేశిస్తే సంతోషించాలి అని అన్నారు. ధరణి పోర్టల్ ను అడ్డం పెట్టుకొని భూములు లాక్కున్నారు అని ధ్వజమెత్తారు. వందలాది ఎకరాలు కబ్జా చేసిన వాటిపై హౌస్ కమిటీ వేయాలి అని భట్టి సభను కోరారు.