Reading Time: < 1 minute

హైదరాబాద్: మండల సమవేశాలు ప్రారంభకాగానే బిఆర్‌ఎస్ ఎంఎల్‌సిలు నిరసన తెలిపారు. శాసన మండలి వెల్‌లోకి బిఆర్‌ఎస్ ఎంఎల్‌సిలు దూసుకొచ్చారు. రాఘవ కన్‌స్ట్రక్షన్‌పై హౌస్ కమిటీ వేయాలని బిఆర్‌ఎస్ సభ్యులు డిమాండ్ చేశారు. ప్లకార్డులు పట్టుకొని బిఆర్‌ఎస్ ఎంఎల్‌సిలు నిరసన తెలిపారు. మంత్రి అడ్లూరి లక్ష్మణ్ ప్రసంగిస్తుండగా బిఆర్‌ఎస్ ఎంఎల్‌సి నిరసన తెలపడంతో సభకు అంతరాయం ఏర్పడింది. దీంతో బిఆర్ఎస్ ఎంఎల్ సిలు సభ నుంచి వాకౌట్ చేశారు. అనంతరం గన్ పార్కు చేరుకొని నినాదాలు చేశారు.  అక్రమ మైనింగ్ కు పాల్పడిన పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. రాఘవ కనస్ట్రక్షన్స్ అక్రమాలపై హౌస్ కమిటీ, హైకోర్ట్ సిట్టింగ్ జడ్జీలతో విచారణ జరిపించాలని నినాదాలు చేశారు.