Reading Time: < 1 minute

ఛత్తీస్‌గఢ్ లోని సుక్మా జిల్లాలో భద్రతా బలగాలకు, మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో మావోయిస్టు పార్టీ ప్లాటూన్ నంబర్ 31 సెక్షన్ కమాండర్ మృతి చెందాడు. పోలంపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఆటవీ ప్రాంతంలో ఆదివారం మధ్యాహ్నం జరిగిన ఎదురు కాల్పుల్లో కమాండర్ ముచాకి కైలాస్ మృతి చెందాడు.ప్రస్తుతం ఆ ప్రాంతంలో ఇరువర్గాల మధ్య అడపాదడపా కాల్పులు కొనసాగుతున్నాయి .ఎదురు కాల్పుల విషయాన్ని సుక్మా జిల్లా ఎస్పీ కిరణ్ చవాన్ ధ్రువీకరించారు. సంఘటనా ప్రాంతం నుంచి మావోయిస్టు మృతదేహంతో పాటు ఒక ఆయుధాన్ని బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. మృతిచెందిన మావోయిస్టు ఐఇడీలు పేల్చడం , బలగాలపై దాడులు వంటి నేరాల్లో పాల్గొన్నట్లు ఎస్పీ వెల్లడించారు. ఇతనిపై ఐదు లక్షల రివార్డు ఉన్నట్లు చెప్పారు. మావోయిస్టులు లొంగిపోయేందుకు చివరి అవకాశం కొద్ది సమయం మాత్రమే మిగిలి ఉందని,హింసా మార్గాన్ని వీడాలని బస్తర్ ఐ జి సుందర్ రాజ్ మరోసారి విజ్ఞప్తి చేశారు.