Reading Time: < 1 minute

హైదరాబాద్: బిఆర్ఎస్, బిజెపి కుమ్మక్కై కాళేశ్వరంపై విచారణ ముందుకు సాగనివ్వడం లేదు అని సిఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు. బిజెపి మాటల నమ్మి కాళేశ్వరంపై విచారణ సిబిఐకు ఇస్తే ఇప్పటి వరకు చర్యలు లేవు అని అన్నారు. తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో కాళేశ్వరంపై సిఎం మాట్లాడారు. కాళేశ్వరంలో దోపిడీపై ప్రధాని నరేంద్ర మోడీ ప్రస్తావించారు అని.. శనివారం మైనింగ్ పై చర్చకు అవకాశం ఇచ్చాం అని తెలియజేశారు. ధరణి పేరుతో వందల ఎకరాలు మాజీ మంత్రి హరీష్ రావు బంధువులు దోచుకున్నారు అని విమర్శించారు. ధరణి పేరుతో దోపిడీపై హౌస్ కమిటీ వేయడానికి బిజెపి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణా రెడ్డి మద్దతు ఇస్తారా? అని రేవంత్ ప్రశ్నించారు. మహబూబ్ నగర్ జిల్లా బాలనగర్ లో హరీష్ రావు సోదరుడు వందల ఎకరాలు దోచుకున్నారు అని.. బిఆర్ఎస్, బిజెపి ఎన్నికల్లో ఓట్లు పంచుకున్నారు అని మండిపడ్డారు. హరీష్ రావు, బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్, కెవిఆర్ హౌస్ కమిటీ వేయడానికి సిద్ధమా ? అని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు.