Reading Time: < 1 minute

డీఎంకే ఎన్నికల మేనిఫెస్టో.. ఫ్రీ స్కీముల్లో అన్నాడీఎంకే, టీవీకేలకు తగ్గేదేలే !

Caption of Image.

చెన్నై: తమిళనాడులో అధికార డీఎంకే పార్టీ 2026 అసెంబ్లీ ఎన్నికల మేనిఫెస్టోను ఆదివారం(మార్చి 29, 2026) విడుదల చేసింది. సంక్షేమ పథకాలే పరమావధిగా మేనిఫెస్టోను సీఎం స్టాలిన్ ప్రకటించారు. మహిళలకు అందిస్తున్న వెయ్యి రూపాయల నెలవారీ ఆర్థిక సాయాన్ని రెండు వేలకు పెంచుతున్నట్లు స్టాలిన్ తెలిపారు. వృద్ధాప్య పెన్షన్ను రూ.12 వందల నుంచి రూ.2 వేలకు పెంపు, దివ్యాంగులకు అందిస్తున్న సాయాన్ని రూ.15 వందల నుంచి రూ.2 వేల 500కు పెంచుతామని స్టాలిన్ ప్రకటించారు. 

ఇంటి అవసరాల కోసం.. ఇంట్లో సామాన్లు కొనుక్కునేందుకు మహిళలకు రూ. 8,000 విలువైన కూపన్‌లను అందించే ‘ఇల్లతరసి’ పథకాన్ని డీఎంకే మేనిఫెస్టోలో ప్రకటించింది. అల్పాహార పథకాన్ని 8వ తరగతి వరకు పొడిగిస్తామని కూడా మేనిఫెస్టోలో డీఎంకే హామీ ఇచ్చింది.

►ALSO READ | కారు డ్రైవర్ కొడుకుకి ఎమ్మెల్యే టికెట్.. విజయ్ అరుదైన నిర్ణయం

సంవత్సరానికి రూ.5 లక్షల లోపు ఆదాయం ఉన్న కుటుంబాలకు రూ.10 లక్షల వరకూ ఆరోగ్య బీమాను కల్పించనున్నట్లు డీఎంకే తెలిపింది. 20 లక్షలకు పైగా లబ్ధిదారులకు మీటర్లు లేని ఉచిత ఆధునిక విద్యుత్ పంపుసెట్లను రైతులకు అందించనున్నారు. మౌలిక సదుపాయాలు, పట్టణాభివృద్ధి అనేవి మేనిఫెస్టోలో ప్రధానంగా ప్రస్తావించారు. 10 లక్షల కొత్త ఇళ్లు, 10 వేల కొత్త బస్సులు, అలాగే కోయంబత్తూరు, మదురై, సేలం, తిరుచిరాపల్లి దగ్గర ఫ్యూచర్ సిటీలను నిర్మిస్తామని డీఎంకే హామీ ఇచ్చింది.

2030 నాటికి 2 లక్షల ఉద్యోగాలను సృష్టించే లక్ష్యంతో, జిల్లాల వ్యాప్తంగా కొత్త ఐటీ టెక్ పార్కుల ద్వారా పార్కుల ద్వారా పారిశ్రామిక వృద్ధితో పాటు యువతకు ఉపాధి కల్పించే దిశగా కృషి చేస్తామని తమిళనాడు సీఎం స్టాలిన్ ప్రకటించారు. 35 లక్షల మంది కాలేజ్ స్టూడెంట్స్కు ఫ్రీగా ల్యాప్‌టాప్‌లు ఇస్తామని డీఎంకే మేనిఫెస్టోలో తెలిపింది. వరికి కనీస మద్దతు ధరను రూ.3 వేల 500 చేస్తామని, చెరకు కనీస మద్దతు ధరను 4 వేల 500 ఉండేలా చూస్తామని డీఎంకే మేనిఫెస్టోలో ప్రకటించింది.

©️ VIL Media Pvt Ltd.