
IPL 2026: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్ రెండో మ్యాచ్‌లో భాగంగా ముంబైలోని వాంఖడే స్టేడియంలో కోల్‌కతా నైట్ రైడర్స్ వర్సెస్ ముంబై ఇండియన్స్ జట్ల మధ్య హైవోల్టేజ్ పోరు కొనసాగుతుంది. టాస్ గెలిచిన ముంబై కెప్టెన్ హార్దిక్ పాండ్యా బౌలింగ్ తీసుకోవడంతో మొదట బ్యాటింగ్ కి వచ్చిన కేకేఆర్ ఓపెనర్లు కేవలం 4 ఓవర్లలోనే 50 పరుగులు భాగస్వామ్యం నెలకొల్పారు. రహానే– అలెన్ కలిసి ముంబై కెప్టెన్ హార్దిక పాండ్యా బౌలింగ్ లో ఏకంగా 26 పరుగులు రావట్టడంతో కేకేఆర్ 69 పరుగులు పార్టనర్‌షిప్ నెలకోల్పిన తర్వాత శార్దూల్ బౌలింగ్ లో భారీ షాట్ ఆడబోయిన అలెన్ ( 17 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్సులతో 37 పరుగులు) బౌండరీ లైన్ వద్ద తిలక్ వర్మకి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు.
ఫిల్ అలెన్ ఔట్ అయిన తర్వాత కోల్‌కతా కెప్టెన్ అజింక్య రహానే హాఫ్ సెంచరీతో చెలరేగగా, క్రీజులోకి వచ్చిన కేకేఆర్ స్టార్ బ్యాటర్ కెమరూన్ గ్రీన్ సైతం వచ్చి రావడంతోనే ముంబై ఇండియన్స్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. 109 పరుగులు వద్ద శార్దుల్ ఠాకూర్ వేసిన బంతిని ఆడే క్రమంలో బాల్ గాల్లోకి ఎగరడంతో షెర్ఫేన్ రూథర్‌ఫోర్డ్ క్యాచ్ పట్టుకోవడంతో గ్రీన్ డగౌట్ కి వెళ్లిపోయాడు. దీంతో కాస్త ఇబ్బందుల్లో పడిన కేకేఆర్ ని కెప్టెన్ రహానే ముందుండి నడిపిస్తున్నాడు. 9 ఓవర్ తర్వాత ముంబై ఇండియన్స్ బౌలర్లు కాస్త పదునైనా బాల్స్ వేయడంతో పరుగులని నియంత్రించగలిగారు.
►ALSO READ | Suryakumar Yadav: సూర్యకుమార్కి షాక్.. ముంబై ఇండియన్స్ తుది జట్టులో దక్కని చోటు..
కేకేఆర్ కెప్టెన్ అజింక్య రహానే కేవలం 40 బంతుల్లోనే 3 ఫోర్లు 5 సిక్సులతో 67 పరుగులు చేసిన తర్వాత శార్దూల్ బౌలింగ్ లో ఔట్ అయ్యాడు. ప్రస్తుతం క్రీజులో అంగక్రిష్ రఘువంశీ (17), రింకు సింగ్(1) ఉన్నారు. రఘువంశీ నెమ్మదిగా బ్యాటింగ్ చేయడంతో కోల్‌కతా నైట్ రైడర్స్ స్కోర్ బోర్డు స్లో అయింది. ముంబై బౌలర్లలో శార్దూల్ ఠాకూర్ ఒక్కడే కీలకమైన మూడు వికెట్ల పడగొట్టాడు. మిగతా బౌలర్లలో ఏ.ఎం. ఘజన్‌ఫర్, ట్రెంట్ బోల్ట్, కెప్టెన్ హార్దిక్ పాండ్యా ధారళంగా పరుగులు సమర్పించుకున్నారు. ప్రస్తుతం కేకేఆర్ 13 ఓవర్లు ముగిసే సమయానికి 145/3 తో కొనసాగుతుంది.
First Six in Purple & Gold 🥹💜pic.twitter.com/Gq7hMW7HCb
— KolkataKnightRiders (@KKRiders) March 29, 2026