మీరు ఆధార్ కార్డు పొగోట్టుకున్నారా..? కనీసం ఆధార్ నెంబర్ కూడా గుర్తులేదా..? అయితే నో టెన్షన్. మీరు నిమిషాల్లోనే మీ ఆధార్ వివరాలు పొందవచ్చు. ఇందుకోసం ఎక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదు. మీ మొబైల్ ద్వారానే సులువుగా ఆధార్ నెంబర్ పొందటంతో పాటు ఈ-ఆధార్ డౌన్ లోడ్ చేసుకుని ఉపయోగించుకోవచ్చు. ఆధార్ పొగోట్టుకున్నప్పుడు ఏం చేయాలి..? అనే వివరాలు తెలుసుకుందాం
యూఐడీఏఐ అధికారిక వెబ్ సైట్ ఓపెన్ చేయండి. అందులో మెయిన్ పేజీలో Retrieve Lost or Forgotten (EID/UID ) అనే ఆప్షన్‌పై క్లిక్ చేయండి. ఆ తర్వాత మొబైల్ నెంబర్, పేరు, ఇతర వివరాలు నమోదు చేయండి. ఆ తర్వాత గెట్ ఓటీపీపై క్లిక్ చేసి ఓటీపీని నమోదు చేయండి. ఈ తర్వాత మీ ఆధాన్ నెంబర్ మొబైల్ నెంబర్‌కు ఎస్ఎంఎస్ రూపంలో అందుతుంది.
ఆ తర్వాత యూఐడీఏఐ వెబ్సైట్లోకి తిరిగి వెళ్లి డౌన్ లోడ్ ఆధార్‌పై క్లిక్ చేయండి. మీ ఆధార్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్, ఇతర వివరాలు నమోదు చేయండి. ఆ తర్వాత పీడీఎఫ్ ఫైల్ డౌన్ లోడ్ చేసుకోండి. మీ పేరులోని మొదటి 4 అక్షరాలు క్యాపిటల్ లెటర్స్, మీ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేస్తే ఆ ఫైల్ ఓపెన్ అవుతుంది. దానిని మీరు జిరాక్స్ తీయించుకుని ఉపయోగించుకోవచ్చు.
సురక్షితంగా ఆధార్ ఉపయోగించుకునేందుకు మస్క్డ్ ఆధార్ డౌన్ లోడ్ చేసుకోవడం మంచిది. ఇందులో మీ ఆధార్ నెంబర్ చివరి నాలుగు అంకెలు మాత్రమే కనిపిస్తాయి. దీని వల్ల మీ ఆధార్ దుర్వినియోగం అవ్వదు. ఆధార్ నెంబర్ లేదా ఆధార్‌ను డౌన్ లోడ్ చేసుకోవాలంటే ఖచ్చితంగా ఆధార్-మొబైల్ నెంబర్ లింక్ అయి ఉండాలి. లేకపోతే ఆధార్ పోర్టల్ లేదా యాప్‌లోకి వెళ్లి మొబైల్ నెంబర్ అప్డేట్ చేసుకోండి.
మీ ఆధార్ సాఫ్ట్ కాపీని ఎప్పుడూ మీ ఫోన్లో లేదా మెయిల్లో భద్రపర్చుకోండి. మీకు అవసరమైన సమయంలో వెంటనే వినియోగించుకునేందుకు వీలుగా ఉంటుంది. ఇక ఆధార్ బయోమెట్రిక్ వివరాలను లాక్ చేసుకోవడం వల్ల మీ బయోమెట్రిక్ ఇతరులు ఉపయోగించి ఎలాంటి లావాదేవీలు చేయలేరు.




