
మంచిర్యాల జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. బ్రిక్స్ కంపెనీలో ఆడుకుంటున్న ఎనిమిది నెలల పసిపాప లారీ కింద పడి మృతి చెందింది. ఆదివారం ( మార్చి 29 ) జరిగిన ఈ ఘటనకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి.. మంచిర్యాల జిల్లా నస్పూర్ పట్టణంలోని సీతారాంపల్లిలో బ్రిక్స్ కంపెనీలో ఆడుకుంటున్న ఎనిమిది నెలల పాప లారీ కింద పడి మృతి చెందింది.
లారీ రివర్స్ లో వస్తుండగా… పాప లారీ టైర్ కింద పడినట్లు తెలుస్తోంది. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. ఎనిమిది నెలల పసికందు మృతి చెందటంతో కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
ఇదిలా ఉండగా… కామారెడ్డి జిల్లాలో బైకు అదుపుతప్పి ముగ్గురు మృతి చెందారు.జిల్లాలోని గాంధారి మండలం రాంపూర్ గడ్డ సమీపంలో జరిగింది. స్థానిక రైస్ మిల్లులో పని చేస్తున్న యూపీ, బిహార్ లకు చెందిన కార్మికులు నిన్న రాత్రి ఒకే బైక్పై వెళ్తుండగా అదుపుతప్పి రోడ్డు కిందకు దూసుకుపోయింది. ఈ ప్రమాదంలో లల్తూరు ముకియ (21), రాహుల్ (21), జవీద్ అముశరీ(22) అక్కడికక్కడే ప్రాణాలు కోల్పో యారు. గాంధారి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.