
పార్టీలు జరిగినప్పుడు ఇంటిని డెకరేట్ చేసేందుకు ఈ లైట్లు బాగా ఉపయోగపడతాయి. మష్రూమ్ డిజైన్‌లో ఉండే ఈ ఎల్‌ఈడీ లైట్లను ఎంఫర్‌ఎం అనే కంపెనీ తీసుకొచ్చింది. ఇవి సున్నితమైన కాంతిని ఇస్తాయి. కాబట్టి నైట్ ల్యాంప్‌గా కూడా వాడుకోవచ్చు. వీటిలో మరో ప్రత్యేకత ఏంటంటే.. స్మార్ట్ సెన్సర్‌తో పనిచేస్తాయి. చీకటిగా ఉన్నప్పుడు మాత్రమే వెలుగుతాయి. ఉదయం వెలుతురు రాగానే ఆటోమేటిక్‌గా ఆఫ్ అవుతాయి. మోషన్ సెన్సర్ ఉండడం వల్ల కదలికలను గుర్తించినప్పుడు కూడా ఆన్ అవుతాయి. వీటిని పవర్ సాకెట్‌కి కనెక్ట్ చేసి పెడితే సరిపోతుంది. పదే పదే ఆన్/ఆఫ్ చేయాల్సిన అవసరం లేదు. ఎల్‌ఈడీ లైట్లు కావడంతో వేడిని కూడా ఎక్కువగా ఉత్పత్తి చేయవు.
►ALSO READ | Non-Vez recipes: చికెన్ గారెలు.. వెరైటీ ఎగ్ స్నాక్స్ .. ఇలా చేస్తే.. టేస్ట్ అదుర్స్..