Reading Time: 2 minutes
Cm Revanth Reddy Mining Scam Cbcid Probe Raghava Constructions Telangana

CM Revanth Reddy: రాఘవ కన్‌స్ట్రక్షన్స్‌పై తాము ఇచ్చిన నోటీసునే బీఆర్ఎస్ ప్రస్తావించిందని సీఎం రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. ఇదే నోటీసులపై సభలో హడావిడి చేస్తున్నారని.. మైనింగ్ అక్రమాలపై విచారణకు ఆదేశించామని తెలిపారు. తాజాగా మైనింగ్ అంశంపై అసెంబ్లీలో సీఎం మాట్లాడారు. “12 ఏళ్లుగా జరుగుతున్న మైనింగ్ దోపిడీపై సీబీసీఐడీ విచారణ జరుపుతుంది. అక్రమాలను మేము గుర్తించి, మేమే నోటీసులు ఇచ్చాం. గత ప్రభుత్వం చేసిందేమీ లేదు. మీకు ఏ అనుమానం ఉన్నా సీబీసీఐడీ ఇవ్వండి. మైనింగ్ శాఖలో అవినీతి నిగ్గు తేల్చాలని మేం నిర్ణయించాం. నీవు చేసిన పనికి నేను ఇరుకున్నానని హరీష్ రావుపై కేటీఆర్ దాడి చేశారు. దాన్ని దృష్టి మళ్లించడానికే ఇవాళ సభలో గందరగోళం చేస్తున్నారు.” అని సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు.

READ MORE: Samantha : సినీ రంగం అమ్మయిలకు సురక్షితం కాదు.. సమంత ఎమోషనల్ స్పీచ్!

ఆదాయాన్ని పెంచి పేదలకు పంచాలనే విధానంతో ముందుకు వెళుతున్నామని సీఎం తెలిపారు. “సంస్కరణలు తీసుకొచ్చి ప్రభుత్వ ఆదాయాన్ని పెంచుతున్నాం. రాఘవ కన్స్ట్రక్షన్ విషయంలో 2025 లో వాస్తవ పరిస్థితులు తెలుసుకుని మైనింగ్ శాఖ పన్నులు రాబట్టుకుంది. ప్రభుత్వ ఆదాయానికి గండి పడకుండా చర్యలు తీసుకున్నాం. ఇంత పారదర్శకంగా మేం తీసుకున్న చర్యలను అభినందిస్తే మా అధికారులు మరింత ఉత్సాహంగా పనిచేసేవారు. హరీష్ రావు, కేటీఆర్, ఇతర సభ్యులకు విజ్ఞప్తి చేస్తున్నా. ఇతర పార్టీల సభ్యులు కూడా తెలంగాణ ఖనిజ సంపద దోపిడీకి సంబంధించి సమాచారం అధికారులకు ఇవ్వండి. సంపూర్ణంగా విచారణ చేసి దోషులను శిక్షించే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుంది. హౌస్ కమిటీ వేసినా నివేదికను మళ్లీ ఏదో ఒక ప్రభుత్వ విచారణ సంస్థకు ఇవ్వాల్సిందే. అందుకే మేం నేరుగా సీబీసీఐడీ విచారణకు ఆదేశించాం. సీబీసీఐడీ పై నమ్మకం లేకపోతే సీబీఐకి విచారణ అప్పగించాలా చెప్పండి.. బ్లాక్ మెయిల్ చేయడానికే వారు హౌస్ కమిటీ కోరుతున్నారు.. ఇక్కడ మీ పప్పులు ఉడకవు. భట్టి నీ సిఎల్పీ నేతను చేస్తే.. కక్ష కట్టి MLA లను పార్టీ నుంచి లాక్కుని ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేశారు కేసీఆర్. భట్టిను సీఎల్‌పీ నేతగా తొలగించి పైశాచిక ఆనందం పొందారు. భట్టి బడ్జెట్ పెడితే.. నీకు బడ్జెట్ పెట్టరాదు. బడ్జెట్ ఇట్లనె పెట్టాలా..? అని అవమానిస్తున్నారు హరీష్ రావు. సభకు కేసీఆర్ రావడం లేదు. దళితుడు పైన కూర్చుంటే నేను మైక్ అడగాలా? నేను కింద కూర్చోవాలా అని అహంకారం కేసీఆర్‌కు ఉంది. ఆయన పెద్దోడు. అని చూసి చూడనట్టు వదిలేద్దాం. వీళ్లకు ఏం అయ్యింది.” అని సీఎం రేవంత్‌రెడ్డి ప్రశ్నించారు.

READ MORE: Houthis: కీలక మలుపు.. ఇరాన్‌కు మద్దతుగా యుద్ధంలోకి హౌతీల ప్రవేశం..