
తిరుమల భక్తులకు నిత్య అన్నదానం జరుగుతూ ఉంటుంది. ఈ విషయం అందరికి తెలిసిందే. అయితే గతవారం అంటే 2026 మార్చి 21 నుంచి 27 వ తేది వరకు టీడీడీ నిత్యాన్న ప్రసాదానికి అనూహ్యంగా ఆదరణ పెరిగిందని టీటీడీ అధికారులు తెలిపారు. మార్చి 21–27 మధ్యలో రికార్డు స్థాయిలో 17.13 లక్షల మంది భక్తులు అన్నప్రసాదాలు స్వీకరించారు.
2026 ఫిబ్రవరి నెల చివరి వారంలో ( ఫిబ్రవరి 21–27 మధ్యలో)14.96 లక్షల మంది భక్తులు అన్నప్రసాదాన్ని స్వీకరించారు. మార్చి నెల చివరిలో 2.16 లక్షల మంది భక్తులకు అదనంగా అన్నప్రసాదాలను శ్రీవారి భక్తులు టీటీడీ వితరణ చేసింది. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత క్రమంగా తిరుమలలో అన్న ప్రసాదానికి ఆదరణ పెరుగుతుంది. భోజనం మెనూలో వడను టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు ప్రవేశపెట్టి… నాణ్యమైన పదార్దాలతో భక్తులకు రుచికరమైన ఆహారాన్ని టీటీడీ అందిస్తుంది.
టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు ఆదేశాలలతో.. నిరంతర పర్యవేక్షణలో మహా యజ్ఞంలా అన్నప్రసాద వితరణ సాగుతుంది. పశ్చిమాసియా యుద్ధ ప్రభావంతో టీటీడీ అన్నప్రసాదాలకు కొంతమేరకు తాకిడి పెరిగిందని టీడీడీ అధికారులు తెలిపారు.
తిరుమలలో గ్యాస్ కొరత వల్ల పదుల సంఖ్యలో హోటళ్లు మూతపడ్డాయి. మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ భవనం, వైకుంఠం క్యూకాంప్లెక్స్ 2, పీఏసీ2,4&5 , 4 ఫుడ్ కౌంటర్లతో పాటు రద్దీ పెరిగినప్పుడు ఔటర్ క్యూలైన్లు వద్ద నిరంతరాయంగా అన్నపానీయాలను టీటీడీ వితరణ చేస్తోంది. భక్తులు ఇబ్బంది పడకుండా క్యూ లైన్లలో కూడా పాలు, కాఫీ, భోజనంతో పాటు , ఫ్లావర్డ్ రైస్ ఐటమ్స్ ను పంపిణీ చేస్తున్నారు.
తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు నిత్యం వేలాది మంది భక్తులు సుదూర ప్రాంతాల నుంచి తరలి వస్తుంటారు. ఎన్నో వ్యయ ప్రయాసలకు వోర్చి శ్రీవారిని దర్శించుకుంటూ ఉంటారు. శ్రీవారి దర్శనం కోసం కిలోమీటర్ల దూరం నుంచి తిరుమలకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా టీటీడీ చర్యలు తీసుకుంటూ ఉంటోంది. దర్శనం దగ్గర నుంచి వసతి, అన్నప్రసాదాలు ఇలా ప్రతీ విషయాన్ని చాలా జాగ్రత్తగా పర్యవేక్షిస్తుంది.