Reading Time: < 1 minute

ఎమ్మెల్యే కడియం శ్రీహరి నీతి, నిబద్ధతను దేశంలో ఎవరు ప్రశ్నించలేరని.. ఆయన మచ్చలేని నాయకుడని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. మాజీ సిఎం కెసిఆర్‌కు సమానంగా కడియం శ్రీహరి ప్రజా జీవితం నుంచి వచ్చారన్నారు.

ఆదివారం అసెంబ్లీ సమావేశాల సందర్భంగా కడియం శ్రీహరి మాట్లాడుతుండగా గన్‌తో కాల్చి పడేస్తానంటూ సైగలు చేయడంతో ఏ పార్టీలో ఉన్నావని ప్రశ్నించారు. కౌశిక్ రెడ్డి ప్రవర్తనపై సిఎం రేవంత్ ఆగ్రహం వ్యక్తం చేశారు. “బిఆర్ఎస్ సభ్యుడి ప్రవర్తన సమర్థనీయమా? అని కెటిఆర్, హరీష్ రావును అడుగుతున్నా. అసభ్యకరంగా, అసహ్యంగా ప్రవర్తిస్తే సమర్థిస్తారా?. ఇది మీ పార్టీ విధానమా?. కెసిఆర్‌ను అవమానిస్తే మీరు ఊరుకుంటారా?. కడియంకు జరిగిన అవమానమే కెసిఆర్‌కు ఎదురైతే పరిస్థితి ఏంటి?” అని ప్రశ్నించిన సిఎం రేవంత్.. కౌశిక్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ కు విజ్ఞప్తి చేశారు.