Reading Time: 2 minutes

ఆధ్యాత్మికం : హనుమత్ జయంతి ఎప్పుడు.. ఆరోజు ఏంచేయాలి.. ఏఏ మంత్రాలు చదవాలి.. 

Caption of Image.

చైత్ర పౌర్ణమి .. చైత్ర మాసంలో వచ్చే పౌర్ణమి నాడు హనుమంతుడు రాముడిని కలిసిన విజయదినంగా, లేదా జన్మదినంగా ఉత్తరాదిన పాటిస్తారు. పంచాంగం ప్రకారం ఈ ఏడాది (2026) చైత్ర పౌర్ణమి ఏప్రిల్ 2వ తేదీన వస్తుంది. అందువల్ల, హనుమాన్ జయంతిని కూడా ఏప్రిల్ 2వ తేదీ, గురువారం నాడు జరుపుకుంటారు. ఆరోజు  ఏంచేయాలి.. ఎలాంటి నియమాలు పాటించాలో ఈ స్టోరీలో తెలుసుకుందాం. . !

హనుమాన్ జయంతిని భారతదేశంలో రెండు ప్రధాన సమయాల్లో జరుపుకుంటారు. ఉత్తర భారతదేశంలో చైత్ర పౌర్ణమి నాడు (హనుమంతుని జన్మదినం) జరుపుకోగా..  ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వంటి దక్షిణ భారత రాష్ట్రాల్లో వైశాఖ బహుళ దశమి నాడు స్వామివారి జన్మోత్సవాన్ని వైభవంగా నిర్వహిస్తారు. 

చైత్ర పౌర్ణమి .. ( 2026 ఏప్రిల్​ 2)  వైశాఖ బహుళ దశమి ఈ రెండు రోజులు కూడా హనుమంతుడికి అత్యంత పవిత్రమైనవి, భక్తులు ఈ కాలంలో 41 రోజుల దీక్షచేస్తూ.. ప్రత్యేక పూజలు చేస్తారు. 

హనుమాన్ జయంతి పండుగకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. భక్తి శ్రద్దలతో జరుపుకుంటారు. మత విశ్వాసాల ప్రకారం, ఈ పండుగను ప్రతి సంవత్సరం చైత్ర మాసం పౌర్ణమి రోజున జరుపుకుంటారు. ఆ రోజున హనుమంతుడిని పూజిస్తారు. కలియుగంలో కూడా హనుమాన్ అమరత్వం కలిగి ఉంటారని నమ్ముతారు. హనుమంతుడిని ఆరాధించడం వల్ల చాలా సమస్యలు తొలగి పోతాయి. అలాగే ఈ రోజున భక్తులు అనేక పరిహారాలను పాటిస్తారు.

హనుమాన్ జయంతి ఎప్పుడు? 

ఈసారి హనుమాన్ జయంతి పండుగను ఏప్రిల్ 2, 2026న జరుపుకుంటారు. పంచాంగం ప్రకారం చైత్ర పూర్ణిమ తిథి బుధవారం, ఏప్రిల్ 1, 2026 న ఉదయం 7:06 గంటలకు ప్రారంభమవుతుంది. ఏప్రిల్ 2, 2026న గురువారం ఉదయం 7:41 గంటల వరకు ఉంటుంది. అటువంటి పరిస్థితిలో ఉదయ తిధి ప్రకారం 2026 ఏప్రిల్ 2న హనుమాన్ జయంతిని జరుపుకుంటారు.

ఎలా పూజించాలి

  • హనుమాన్ జయంతి రోజున సూర్యోదయం కంటే ముందే అంటే తెల్లవారుజామునే నిద్రలేచి స్నానం చేయాలి.
  • దగ్గర్లో ఉండే హనుమంతుని దేవాలయానికి వెళ్లి సింధూరం సమర్పించాలి.
  •  హనుమాన్‌తో పాటు శ్రీ సీతారాములను పూజించాలి.
  •  ఎర్ర చందనం, అక్షింతలు, పూలు, ధూప దీపాలు, బట్టలు, పండ్లు తదితర వాటిని హనుమంతుడికి సమర్పించాలి.
  •  హనుమాన్ జయంతి వేళ హనుమాన్ చాలీసా, సుందరకాండ పఠించాలి.
  • పూజ పూర్తయిన తర్వాత హారతి ఇచ్చి, ప్రసాదాన్ని అందరికీ పంచాలి.
  •  హనుమంతుని ప్రత్యేక అనుగ్రహం కోసం ‘‘ఓం హం హనుమాన్ నమః’’ ‘‘ఓం నమో భగవతే హనుమాన్ నమః’’ అనే మంత్రాలను జపించాలి.
  •  హనుమాన్ జయంతి రోజున ఉపవాసం ఉండి నేలపైనే నిద్రించాలి

స్వామికి అప్పాలు నైవేద్యంగా సమర్పించాలి. 

ఏం చేయాలి..

  • హనుమాన్ జయంతి రోజు ( ఏప్రిల్​ 2 )  ఆంజనేయస్వామి అవతారంగా భావించే కోతులకు బెల్లం తినిపించటం వల్ల శుభం కలుగుతుంది.
  •  దానాలు చేయటం కూడా మంచిది. దానాలు చేయటం వల్ల మన సమస్యలు తొలికి, ప్రశాంతత లభిస్తుంది.
  • హనుమంతుడికి సింధూరం అర్పిచటం వల్ల మంచి జరుగుతుంది.
  • పవిత్రమైన ఈ రోజున శృంగారం, మాంసం, మద్యం, పొగతాగడం  వంటి వాటికి దూరంగా ఉండాలి.
  • ఎర్రని పూలు, నెయ్యి, నువ్వుల నూనెతో దేవుడికి అర్చన చేయటం వల్ల శుభం కలుగుతుంది.

హనుమంతుని జీవితమంతా శ్రీరాముని సేవకే అంకితమైంది. ఆయనకు శక్తి, జ్ఞానం, విజయాలు కేవలం సాధనాలు మాత్రమే. భగవంతునికి సేవ చేయడమే ఆయన ప్రాథమిక లక్ష్యం. ఆయన తన బలాన్ని ఎప్పుడూ అహంకారంతో ప్రదర్శించలేదు…  కానీ ప్రతి పనిలో వినయానికి, అంకితభావానికి ప్రాధాన్యత ఇచ్చారు. తులసీదాస్ ఆయనను మహాప్రభు ..  మహాతపస్వి అని పిలిచారు.  ఆయన త్యాగం .. సేవ .. ఆదర్శాల కారణంగానే ఈ విశ్వంలో నేటికీ నిలిచి ఉన్నారు. అందుకే ఆయనను కేవలం బలానికి ప్రతీకగా మాత్రమే కాకుండా.. ఒక ఆదర్శ భక్తుడిగా కూడా పూజిస్తారు.
 

©️ VIL Media Pvt Ltd.