Reading Time: < 1 minute

IPL 2026: ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్ సూపర్ రికార్డ్.. ఎవరికి అందనంత ఎత్తులో..

Caption of Image.

IPL 2026: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) చరిత్రలో అనేక రికార్డులు సృష్టించిన ఫ్రాంచైజీలలో ముంబై ఇండియన్స్ జట్టు మరో అరుదైన ఘనతని సాధించే దిశగా దూసుకుపోతోంది. గత 18 సీజన్లలో ఇప్పటి వరకు ముంబై టీమ్ మొత్తం 299 టీ20 మ్యాచ్‌లు ఆడుతూ, ఈ జాబితాలో నెంబర్ వన్ స్థానంలో కొనసాగుతుంది. ప్రస్తుతం జరుగుతున్న సీజన్‌లోనే 300 మ్యాచ్‌ల మైలురాయిని చేరే తొలి జట్టుగా హార్థిక్ పాండ్యా సేన నిలవడం ఖాయంగా కనిపిస్తుంది. కాగా ఐపీఎల్ లో అత్యధిక మ్యాచులు ఆడిన ఈ జాబితాలో ముంబై ఇండియన్స్ తర్వాత మరిన్నీ జట్లు కూడా ఉన్నాయి. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, కోల్‌కతా నైట్ రైడర్స్, చెన్నై సూపర్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ టీమ్స్ సైతం అత్యధిక మ్యాచ్‌లు ఆడిన ఫ్రాంచైజీల జాబితాలో కొనసాగుతున్నాయి. 

అత్యధిక టీ20 మ్యాచ్‌లు ఆడిన జట్లు:
* ముంబై ఇండియన్స్ – 299
* రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు – 287
* కోల్‌కతా నైట్ రైడర్స్ – 281
* చెన్నై సూపర్ కింగ్స్ – 277
* ఢిల్లీ క్యాపిటల్స్ – 274

విజయాల శాతంలో ముంబై దూకుడు:  
300 టీ20 మ్యాచ్‌లు ఆడిన మొట్ట మొదటి ఫ్రాంచైజీ జట్టుగా నిలవనుండటంతో పాటు ఐపీఎల్ జట్లలో చెన్నై సూపర్ కింగ్స్ 56.67 విజయాల శాతం తర్వాత ముంబై 54.18 శాతంతో రెండో స్థానంలో నిలిచింది. ప్రస్తుతం,  ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ రెండూ చెరో ఐదు ఐపీఎల్ ట్రోఫీలతో పాటు రెండు సీఎల్‌టీ20 ట్రోఫీలతో గెలుచుకుని సమంగా ఉన్నాయి. 2020లో చివరిసారిగా ట్రోఫీని గెలుచుకున్న ఈ టీమ్స్, 19 ఎడిషన్ లో 6వ ఐపీఎల్ ట్రోఫీపై కన్నేశాయి.

►ALSO READ | IPL 2026: ముంబైకి శాపంగా మారిన ఫస్ట్ మ్యాచులోనే ఓటమి.. ఈసారైనా గెలిచేనా!

©️ VIL Media Pvt Ltd.