Reading Time: < 1 minute

టెర్మినల్ బెనిఫిట్స్ చెల్లింపులు సకాలంలో సాగాలి : సింగరేణి కాలరీస్ కంపెనీ జీఎం వెల్ఫేర్ జీవీ కిరణ్ కుమార్

Caption of Image.

భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : కార్మికులకు సంబంధించిన టెర్మినల్ బెనిఫిట్స్​ చెల్లింపులు సకాలంలో జరిగేలా పర్సనల్​ అధికారులు​ చొరవ చూపాలని సింగరేణి కాలరీస్​ కంపెనీ జీఎం వెల్ఫేర్ జీవీ కిరణ్ కుమార్​ పేర్కొన్నారు. కొత్తగూడెంలోని సింగరేణి హెడ్డాఫీస్​ నుంచి సింగరేణిలోని అన్ని ఏరియాల్లోని పర్సనల్​ ఆఫీసర్లతో శనివారం వీడియో కాన్ఫరెన్స్​ నిర్వహించారు. 

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉద్యోగుల సంక్షేమం విషయంలో రాజీ పడవద్దన్నారు. టెర్మినల్ బెనిఫిట్స్ చెల్లింపులలో జాప్యం ఉండకూడదన్నారు. కారుణ్య నియామకాలపై చర్చించారు. ఈ ప్రోగ్రాంలో డీజీఎంలు కేసా నారాయణరావు, ముకుంద సత్యనారాయణ, సీనియర్​ పీవో ఎం.శ్రీనివాస్, అధికారులు సుజ్ఞాన్, కె.వర ప్రసాద రావు పాల్గొన్నారు. 

©️ VIL Media Pvt Ltd.