Reading Time: < 1 minute

మైనింగ్ వ్యవహారాలపై శాసన మండలిలో రచ్చ… బీఆర్ఎస్ సభ్యులు సస్పెండ్ 

Caption of Image.

మైనింగ్ వ్యవహారాలపై తెలంగాణ శాసనమండలిలో గందరగోళం నెలకొంది. సోమవారం ( మార్చి 30 ) సభలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఛైర్మెన్ పోడియం దగ్గరికి దూసుకెళ్లారు బీఆర్ఎస్ సభ్యులు.ఈ క్రమంలో సభలో గందరగోళం నెలకొంది. బీఆర్ఎస్ సభ్యుల ఆందోళన మధ్యనే తల్లిదండ్రుల సంరక్షణ బిల్లును ప్రవేశపెట్టింది ప్రభుత్వం. మంత్రి పొంగులేటి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ నినాదాలు చేశారు బీఆర్ఎస్ సభ్యులు. ఎంతసేపటికీ ఆందోళన విరమించకపోవడంతో బీఆర్ఎస్ సభ్యులను సభ నుంచి  సస్పెండ్ చేస్తున్నట్లు తెలిపారు చైర్మెన్ గుత్తా సుఖేందర్ రెడ్డి.

సభ కార్యక్రమాలకు అడ్డుపడుతున్న క్రమంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీలను సస్పెండ్ చేస్తున్నట్లు తెలిపారు చైర్మెన్ గుత్తా. ఎమ్మెల్సీ మధుసూధనాచారి, తాతా మధు, వాణీదేవి సహా బీఆర్ఎస్ సభ్యులను సస్పెండ్ చేస్తున్నట్లు తెలిపారు చైర్మెన్ గుత్తా. ఇవాళ ఒకరోజు సభ నుంచి బీఆర్ఎస్ సభ్యులను సస్పెండ్ చేసినట్లు తెలిపారు. 

ఇదిలా ఉండగా.. అసెంబ్లీలో కూడా బీఆర్ఎస్ సభ్యులపై వేటు పడింది. ఆదివారం ( మార్చి 30 ) బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను తెలంగాణ అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేశారు స్పీకర్ గడ్డం ప్రసాద్. బడ్జెట్ పై చర్చను అడ్డుకున్నందుకు ఈ సెషన్ ముగిసేంత వరకు సస్పెండ్ చేస్తున్నట్లు స్పీకర్ తెలిపారు. అలాగే ఎమ్మెల్యే కడియం శ్రీహరి పట్ల అనుచితంగా ప్రవర్తించిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి వ్యవహార శైలిపై ఎథిక్స్ కమిటీ సిఫారసు చేసింది అసెంబ్లీ .
 

©️ VIL Media Pvt Ltd.