Reading Time: < 1 minute

దుబాయ్‌‌ డ్రోన్ దాడిలో హిమాచల్ వ్యక్తి మృతి..మార్చి 30న స్వగ్రామానికి భౌతికకాయం

Caption of Image.

సిమ్లా: ఉపాధి కోసం దుబాయ్ వెళ్లిన హిమాచల్ ప్రదేశ్‌‌కు చెందిన ఒక వ్యక్తి డ్రోన్ దాడిలో మృతి చెందాడు. దుబాయ్‌‌లోని ఆర్మీ కంటోన్మెంట్ సమీపంలో జరిగిన డ్రోన్ దాడిలో అతడు మరణించాడు. వివరాల్లోకి వెళ్తే.. ఉనా జిల్లాలోని సనోలి మజ్రా గ్రామానికి చెందిన జస్వీందర్ సింగ్(46) 15 ఏండ్లుగా దుబాయ్‌‌లో డ్రైవర్‌‌గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. నాలుగు రోజుల క్రితం దుబాయ్‌‌లోని ఆర్మీ కంటోన్మెంట్ ఏరియా వద్ద జస్వీందర్ సింగ్ లారీలో సరుకులను లోడ్ చేస్తుండగా డ్రోన్ దాడి జరిగింది. ఈ దాడిలో అతడు అక్కడికక్కడే మృతి చెందాడు.

©️ VIL Media Pvt Ltd.