Reading Time: < 1 minute

జ్యోతి పూర్వాజ్ ప్రధాన పాత్రలో రవి, శ్రేయ తివారి హీరో హీరోయిన్‌గా సిస్ ఫిలిమ్స్ బ్యానర్‌పై సైఫుద్దీన్ మాలిక్ నిర్మాణ దర్శకత్వంలో వస్తున్న చిత్రం ‘విచిత్ర’. ఫ్యామిలీ ఎమోషన్స్‌తో కూడిన హార్రర్ థ్రిల్లర్ ఇది. ఈ చిత్రం మే 22న విడుదల కానుంది. ఈ సందర్భంగా ఈ చిత్ర దర్శక నిర్మాత సైఫుద్దీన్ మాలిక్ మాట్లాడుతూ “ప్రపంచం మొత్తం దూరమైన దగ్గరగా ఉండేది అమ్మ ప్రేమే. ఈ సెంటిమెంట్ నేపథ్యంతో రూపొందిన సినిమా ‘విచిత్ర’. ఫ్యామిలీతో కలిసి సంతోషంగా ఎంజాయ్ చేస్తూ చూసే చిత్రమిది. నిజాని అందించిన అన్ని పాటలు బాగా వచ్చాయి. చిత్ర పాడిన తల్లి సెంటిమెంట్ సాంగ్ హైలెట్‌గా నిలుస్తుంది”అని అన్నారు.