Reading Time: < 1 minute

సౌదీ అరేబియాలోని అమెరికా సైనిక స్థావరాలపై ఇరాన్ దాడులు తీవ్రతరం అయ్యాయి. ఆదివారం ఇరాన్ సౌదీలోని అత్యంత కీలకమైన ప్రిన్స్ సుల్తాన్ వైమానిక స్థావరంపై దాడికి దిగింది. అమెరికా నిర్వహణలో ఉండే ఈ ఎయిర్‌బేస్‌ను ఎంచుకుని జరిపిన దాడిలో అమెరికా శక్తివంతమైన నిఘా విమానం అవాక్స్ దెబ్బతింది. అక్కడి ఆయుధ వ్యవస్థ విధ్వంసం జరిగిందని ఇరాన్ ప్రకటించింది. అంతేకాకుండా అమెరికాకు చెందిన అనేక రిఫ్యూయలింగ్ ప్లేన్లు కూడా దెబ్బతిన్నాయని వివరించారు. ఇరాన్ ప్రెస్ టీవీ సంబంధిత ఫోటోలను విడుదల చేసింది.

ఇందులో నిఘా యుద్ధ నౌక దెబ్బతిని పడి ఉన్న విషయం స్పష్టంగా ఉంది, ఇందుకు ఇరాన్ ఆరు బాలిస్టిక్ మిస్సైల్స్‌ను వాడింది. 29 డ్రోన్లను కూడా ప్రయోగించారు. ఇప్పుడు దెబ్బతిన్న అమెరికా విమానాన్ని యుఎస్‌ఇ3 సెంట్రీ అవాక్స్ విమానంగా పిలుస్తారు. ఇప్పటి ఈ ఘటనపై అమెరికా సెంట్రల్ కమాండ్ ఎటువంటి ప్రకటనా వెలువరించలేదు. ఆదివారం తమ ఇస్లామిక్ రెవెల్యూషనరీ గార్డ్ దాడులలో అమెరికాకు చెందిన యుఎస్ ఎంక్యూ 9 డ్రోన్ , ఎఫ్ 16 ఫైటర్ జెట్‌ను దెబ్బతీశారు. అయితే ఈ విషయాన్ని ఇతర వర్గాలు ధృవీకరించలేదు.