
చార్మింగ్ స్టార్ శర్వా బైకర్ సినిమా కోసం అద్భుతంగా ట్రాన్స్‌ఫర్మేషన్ అయ్యారు. ఇందులో అతను 18 ఏళ్ల రేసర్‌గా కనిపించనున్నారు. ఈ పాత్ర కోసం అతను తన శరీరాన్ని, మనసును పూర్తిగా మార్చుకున్నారు. ఈ చిత్రానికి అభిలాష్ రెడ్డి దర్శకత్వం వహించగా, యువి క్రియేషన్స్ నిర్మిస్తోంది. సినిమా ఏప్రిల్ 3న విడుదల కానుంది. ఇప్పటికే మేకర్స్ శర్వా ట్రాన్స్‌ఫర్మేషన్ వీడియోను విడుదల చేయగా అద్భుతమైన స్పందన వచ్చింది. శర్వాకు ఉదయం సూర్యోదయం కంటే ముందే మొదలయ్యే రోజు, అలసటతో ముగిసేది. ఎక్కువ దూరం పరుగులు, కఠినమైన వ్యాయామాలు చేసేవాడు. ఈ ప్రయాణంలో యోగా అతనికి కీలకంగా నిలిచింది. జిమ్ అతనికి బలం, సహనం ఇచ్చినప్పుడు, యోగా అతని ఆలోచనలను ప్రశాంతం చేసి, ఫోకస్‌ను పెంచింది.దీంతో అతను బరువు తగ్గి కొత్త లుక్‌ను పొందారు. శర్వా కొత్త అవతార్‌కి అద్భుత స్పందన వస్తోంది. శర్వా మాట్లాడుతూ..‘షూటింగ్ మొదటి రోజు అద్దంలో చూసుకున్నప్పుడు, నేను సిద్ధంగా ఉన్న, క్రమశిక్షణతో ఉన్న, అప్‌డేటెడ్ వ్యక్తిని చూశాను. ఈ ప్రయాణం నాకు ఒక విషయం నేర్పింది. ఎంత నిరాశలో ఉన్నా.. ఒక నిర్ణయం తీసుకుంటే పూర్తిగా మారిపోవచ్చు. ఏప్రిల్ 3న మీరు స్క్రీన్‌పై విక్కీని చూస్తే, అది కేవలం నటన కాదు- రెండు సంవత్సరాల కష్టం, మారాలనే పట్టుదల ఫలితాన్నిని చూస్తారు”అని అన్నారు.