Reading Time: < 1 minute

మోకిలా: రంగారెడ్డి జిల్లా మోకిలా పోలీస్ స్టేషన్ పరిధిలో డ్రగ్స్ ను పోలీసులు పట్టుకున్నారు. నలుగురు నిందితులను అరెస్టు చేసి 33 గ్రాముల కొకైన్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మోకిలా నుంచి కొల్లూరుకు డ్రగ్స్ తరలిస్తుండగా నలుగురిని పోలీసులు అదుపులోకి తీసుకొని సోదాలు చేయగా 33 గ్రాముల కోకైన్ లభించింది. వెంటనే వారిని అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు.