Reading Time: 2 minutes
Cinema : హీరో ముసలోడు అని కొనేవాడు రాలేదు.. కట్ చేస్తే.. బాక్సాఫీస్ షేక్ చేసిన సినిమా..

ప్రముఖ నిర్మాత ఎడిద రాజా తన సుదీర్ఘ సినీ ప్రస్థానంలో ఎదురైన అనుభవాలను, ముఖ్యంగా తెలుగు సినీ చరిత్రలో ఒక మైలురాయిగా నిలిచిన శంకరాభరణం చిత్రం వెనుక ఉన్న వాస్తవాలను, సవాళ్లను ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నారు. శంకరాభరణం చిత్రం ఒక సాధారణ విజయం కాదని, అది అనేక అడ్డంకులను అధిగమించి సాధించిన అసాధారణ విజయం అని ఎడిద రాజా తెలిపారు. ఈ చిత్ర నిర్మాణంలో గాయకుడు ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం గారి పాత్ర కీలకమైనదని ఎడిద రాజా వివరించారు. “బాలు గారినే మొదటి నుంచి అనుకున్నాం. ఆయన కథా చర్చల్లో కూడా కూర్చునేవారు. విశ్వనాథ్ గారికి ఆయన కజిన్ బ్రదర్. పాటలు పాడే సమయంలో వేరే ఏమీ పెట్టుకోవద్దని కోరాం, ఆయన డెడికేటెడ్ గా పని చేశారు,” అని ఎడిద రాజా గుర్తు చేసుకున్నారు. ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యంకి గాయకుడిగా తొలి జాతీయ అవార్డు శంకరాభరణం చిత్రానికే వచ్చిందని, ఇది ఆయన కీర్తిని మరింత పెంచిందని ఆయన పేర్కొన్నారు. ఈ చిత్రానికి సంగీత విభాగంలో నాలుగు జాతీయ అవార్డులు లభించాయి. తెలుగు చిత్ర పరిశ్రమకు బెస్ట్ ఫీచర్ ఫిల్మ్ విత్ మాస్ అప్పీల్, ఈస్తటిక్ వాల్యూస్ అండ్ హోల్సమ్ ఎంటర్టైన్మెంట్ కేటగిరీలో తొలి స్వర్ణ కమలం (గోల్డ్ మెడల్) శంకరాభరణం ద్వారానే వచ్చిందని ఎడిద రాజా అన్నారు.

అయితే, ఈ అద్భుతమైన చిత్రానికి విడుదల సమయంలో ఊహించని అడ్డంకులు ఎదురయ్యాయి. “సినిమా రిలీజ్ అయ్యి డిస్ట్రిబ్యూటర్ లేరు. అమ్మకాలు పెడుతుంటే ఎవడూ కొనడానికి రాలేదు. 100 బిజినెస్ షోలు వేశాం. చాలా బాగుంది అని చెప్పి వెళ్ళేవారు కానీ కమర్షియల్‌గా ఎలా ఉంటుంది? అని కొనేవారు కాదు,” అని ఎడిద రాజా ఆనాటి పరిస్థితులను వివరించారు. లక్ష్మి ఫిల్మ్స్ అధినేత లక్ష్మణ్ మూర్తి చొరవ తీసుకుని, కొన్ని ఏరియాలను కొని, కొన్ని ఏరియాలను తాము ఉంచుకుని రిస్క్ తో చిత్రాన్ని విడుదల చేశామని తెలిపారు. ఈ రిస్క్ లో బయటివారికి ఎక్కువ లాభం వచ్చిందని, తమకు తక్కువ పోర్షన్ వచ్చిందని, అయితే విజయం పట్ల తమకు ఎలాంటి చింత లేదని ఆయన అన్నారు.

సినిమా విడుదలైన మొదటి రెండు రోజులు పెద్దగా వసూళ్లు లేవని, మూడో రోజు నుండే కలెక్షన్లు పుంజుకున్నాయని ఎడిద రాజా తెలిపారు. నైజాం వంటి మాస్ ఏరియాల్లో కూడా వారం రోజులకు భారీగా ప్రేక్షకాదరణ లభించిందని, హైదరాబాద్ లోని రాయల్ థియేటర్ (సుల్తాన్ బజార్), సాధారణంగా హిందీ సినిమాలు మాత్రమే ప్రదర్శించే ప్రాంతంలో, ఈ సినిమా ఏకంగా ఒక సంవత్సరం పాటు ఆడిందని పేర్కొన్నారు. కేరళలోనైతే డైలాగ్స్ డబ్ చేసి, పాటలు మాత్రం తెలుగులో ఉంచి విడుదల చేస్తే, ఆ సినిమా రెండు సంవత్సరాలు ప్రదర్శితమైందని తెలిపారు. శంకరాభరణం విజయం తర్వాత ఒకటిన్నర సంవత్సరం పాటు సన్మానాలు, విజయోత్సవాలతో తీరిక లేని సమయం గడిచిందని, అనేక కార్యక్రమాలను తాము అవాయిడ్ చేయాల్సి వచ్చిందని ఎడిద రాజా పంచుకున్నారు.

ఎక్కువమంది చదివినవి : Tollywood: శ్రీదేవి తర్వాత అంత అందమైన హీరోయిన్ ఆమె.. కానీ తన అమ్మ వల్లే ఆమె జీవితం అలా.. నటుడు మురళీ మోహన్..

ఎక్కువమంది చదివినవి : Cinema : సీన్ సీన్‏కు గుండె ఆగిపోద్ది మావ.. క్లైమాక్స్ మాత్రం బీభత్సం.. యూట్యూబ్‏లో దుమ్మురేపుతున్న హారర్ సిరీస్..