Reading Time: 2 minutes

IPL 2026: KKR vs Mi మధ్య హైటెన్షన్ పోరు.. వాంఖడే పిచ్ రిపోర్ట్ ఇదే

Caption of Image.

IPL 2026: ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో ఈ రోజు (2026, మార్చి 29న) రసవత్తర పోరుకు రంగం సిద్ధమైంది. వాంఖడే స్టేడియం వేదికగా ముంబై ఇండియన్స్ వర్సెస్ కోల్‌కతా నైట్ రైడర్స్ జట్లు పోటీ పడనున్నాయి. ఈ మ్యాచ్ రాత్రి 7:30 గంటలకు ప్రారంభం కానుంది. కాగా గతేడాది క్వాలిఫైయర్ –2లో పంజాబ్ కింగ్స్ ఓడిపోయిన.. ముంబై ఇండియన్స్ ఈ సారి టైటిల్ కొట్టాలనే లక్ష్యంగా బరిలోకి దిగబోతుంది. బలమైన బ్యాటింగ్, బౌలింగ్ విభాగం పటిష్టంగా ఉండటంతో.. ఈ ఏడాది హార్థిక్ సేన చాలా స్ట్రాంగ్‌గా కనిపిస్తోంది. కోల్‌కతా నైట్ రైడర్స్‌ వర్సెస్ ముంబై మధ్య జరిగే ఈ పోరు రసవత్తరంగా సాగే ఛాన్స్ ఉంది. 

కోల్‌కతా నైట్ రైడర్స్ ఈ ఏడాది సరికొత్త ఎత్తుగడలతో బరిలోకి దిగుతుంది. 2025 సీజన్‌లో కేవలం 5 మ్యాచ్‌లలో గెలిచి పాయింట్ల పట్టికలో 8వ స్థానంలో నిలిచింది. ఈ ఏడాది అజింక్య రహానే సారథ్యంలోని కేకేఆర్ జట్టు మినీ వేలంలో మంచి మంచి ప్లేయర్స్ ను దక్కించుకుంది. ముఖ్యంగా న్యూజిలాండ్ ఓపెనర్లు టిమ్ సైఫర్ట్, ఫిన్ అలెన్‌తో పాటు కామెరూన్ గ్రీన్, రచిన్ రవీంద్రను సొంతం చేసుకుంది. దాంతో ఈ ఏడాది ట్రోఫీని దక్కించుకునేలా అడుగులు వేస్తుంది. 

►ALSO READ | మేజర్‌‌‌‌ క్రికెట్‌‌‌‌ లీగ్‌‌‌‌లో టీమిండియా వెటరన్‌‌‌‌ స్పిన్నర్‌ అశ్విన్‌‌‌‌

హెడ్ టు హెడ్ రికార్డులు: 
ఐపీఎల్ చరిత్రలో ముంబై ఇండియన్స్ -వర్సెస్ కోల్‌కతా నైట్ రైడర్స్ జట్లు ఇప్పటి వరకు 35 సార్లు తలపడ్డాయి. అందులో ముంబై 24 మ్యాచ్‌లలో గెలుపు సాధించగా, కేకేఆర్ 11 మ్యాచ్‌లలో విజయం సాధించింది. కానీ వాంఖడే స్టేడియంలో ఈరోజు జరిగే మ్యాచ్ మరింత పోటా పోటీగా ఉంటుందని క్రికెట్ పండితులు అంచనా వేస్తున్నారు. ఐపీఎల్ 2026లో భాగంగా రెండో మ్యాచ్‌లో ముంబై వర్సెస్ కేకేఆర్ జట్లు ఈ రోజు రాత్రి 7:30 గంటలకు ప్రారంభం కానుంది. 

పిచ్ రిపోర్టు: 
ఇవాళ రాత్రి ముంబైలోని వాంఖడే వేదికగా KKR వర్సెస్ MI మధ్య మ్యాచ్ జరగనుంది. ఈ గ్రౌండ్ పిచ్ బ్యాటింగ్ ఫ్రెండ్లీగా ఉండనుంది. బ్యాటర్లు స్వేచ్ఛగా అన్ని వైపులా పరుగులు చేసే అవకాశం కనిపిస్తుంది. ఫాస్ట్ బౌలర్లకు మ్యాచ్ ఆరంభంలో కాస్త స్వింగ్ లభించే ఛాన్స్ కనిపిస్తుంది. మ్యాచ్ జరిగే కొద్దీ స్పిన్నర్లు ప్రభావం చూపించే అవకాశం ఉంది. సాధారణంగా ఇక్కడ టాస్ గెలిచిన జట్లు మంచు (Dew ) కారణంగా ఛేజింగ్ చేసేందుకు ఇష్టపడతారు.

©️ VIL Media Pvt Ltd.